STOCKS

News


పేటీఎమ్‌ నష్టాలు.. బుల్లెట్‌ ట్రైన్‌ బడ్జెట్‌ అంత !

Friday 30th November 2018
news_main1543555364.png-22514

ముంబై: భారత్‌లో ఈ కామర్స్‌ సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ నష్టాలు మరింతగా పెరగగలవని కోటక్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది. మొబైల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌ రెండేళ్ల క్రితం ఆరంభించిన పేటీఎమ్‌ మాల్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,806 కోట్ల మేర నష్టాలు వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నష్టాలు.... ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైయిన్‌ ప్రాజెక్ట్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించిన  రూ.1,800 కోట్ల బడ్జెట్‌కు సమానమని వివరించింది.   ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., 

► పేటీఎమ్‌ కంపెనీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్‌ మాల్‌తో ప్రత్యేక ఈ కామర్స్‌ కంపెనీని ఏర్పాటు చేసింది. 
► ఇప్పటివరకూ ఈ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సంస్థలకు  భారీ నష్టాలు వచ్చేవి. 
►  తాజాగా ఈ జాబితాలో పేటీఎమ్‌ కూడా చేరింది. 
► గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్‌ మాల్‌కు రూ.744 కోట్ల ఆదాయం రాగా, రూ.1,806 కోట్ల నష్టాలు వచ్చాయి. 
► పేటీఎమ్‌ మాల్‌కు 2016-18 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.1,971 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇది, ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ సమీకరించిన మొత్తం నిధుల్లో (రూ..4,508 కోట్లు) 44 శాతానికి సమానం. 
► భారత ఈ కామర్స్‌ రంగంలో  నష్టాలు భారీగా వస్తున్నా, వాల్‌మార్ట్‌, అమెజాన్‌ కంపెనీలు తమ భారత సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాయి. పేటీఎమ్‌కు దన్నుగా ఉన్న ఆలీబాబా కూడా ఇదే రీతిగా ఆలోచిస్తోంది. 
► భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థల్లో పేటీఎమ్‌ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌లు ఉన్నాయి. 
► సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌, అలీబాబాడాట్‌కామ్‌ల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో పేటీఎమ్‌ మాల్‌ రూ.2,900 కోట్లు సమీకరించింది. ఈ డీల్‌ ఆధారంగా ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెంచర్‌ విలువను రూ.13,979 కోట్లుగా నిపుణులు అంచనా వేశారు. You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవా కేంద్రాల్లో ఆధార్ సర్వీసులు..

Friday 30th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన 3,000 పైచిలుకు కస్టమర్ సర్వీస్ సెంటర్లలో త్వరలో ఆధార్ నమోదు, అప్‌డేషన్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన పరికరాలు మొదలైన వాటికి దాదాపు రూ.90 కోట్లు వ్యయం కానుందని, దీనికి యూఐడీఏఐ తోడ్పాటు అందించనుందని ఆయన వివరించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు మూడు నెలలు పట్టొచ్చని శ్రీవాస్తవ చెప్పారు. పరికరాల

నేడే సెప్టెంబర్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు

Friday 30th November 2018

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రెండవ త్రైమాసిక (జూలై-సెప్టెంబర్‌) అధికారిక గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంతో (8.2 శాతం) పోల్చితే ఈ వృద్ధి రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ కాలంలో రూపాయి బలహీనత, క్రూడ్‌ ధరల తీవ్రత వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయన్నది విశ్లేషణ. సెప్టెంబర్‌ త్రైమాసిక అంచనాలను ఎస్‌బీఐ రిసెర్చ్‌ 7.5-7.6 శాతం శ్రేణిలో పేర్కొంది.  దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా

Most from this category