STOCKS

News


ఫారెక్స్‌ సేవల్లోకి పేటీఎం

Wednesday 11th July 2018
news_main1531326993.png-18211

న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ ‘పేటీఎం’ తాజాగా ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ సేవల్లోకి అడుగుపెట్టింది. 20 అంతర్జాతీయ కరెన్సీల్లో మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌, ఫారెక్స్‌ క్యాష్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం కస్టమర్లు ఈ సేవలను సంస్థ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందగలరు. త్వరలోనే పేటీఎం యాప్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి. కేవలం 2 శాతం (ఆర్డర్‌ విలువలో) పాక్షిక చెల్లింపుతో ప్రస్తుత ఎక్స్చేంజ్‌ రేట్లను లాక్‌ చేసుకుని ఆర్డర్‌ ఇవ్వొచ్చని, మిగిలిన మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లించొచ్చని కంపెనీ తెలిపింది. అలాగే క్యాష్‌ విత్‌డ్రాయెల్‌, ఆర్డర్లపై కమిషన్‌, సర్వీస్‌ చార్జీ, ఇతర చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఫారెక్స్‌ కార్డులో ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను లోడ్‌ చేసుకోవచ్చు. ఫారెక్స్‌ క్యాష్‌ కింద 3,000 డాలర్ల కరెన్సీ నోట్లను కొనుగోలు చేయవచ్చు.



You may be interested

పీఎన్‌బీ హౌసింగ్‌లో వాటా విక్రయిస్తాం

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలియజేసింది. కార్లైల్‌ గ్రూప్‌తో కలిసి కనీసం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో పీఎన్‌బీకి 32.79 శాతం వాటా, కార్లైల్‌ గ్రూప్‌కు చెందిన క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు 32.36 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 4.8 శాతం వాటాను ఈ ఏడాది మేలో క్వాలిటీ

ప్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 11th July 2018

మరోసారి తెరపైకి ట్రేడ్‌వార్‌ భయాలు సూచీలకు అండగా టీసీఎస్‌ వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో బుధవారం మార్కెట్‌ దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 26 పాయింట్లు లాభంతో 36,266 వద్ద, నిఫ్టీ 1 పాయింటు పెరిగి 10,948 వద్ద ముగిశాయి. చైనా నుంచి దిగుమతిమయ్యే 200 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా తాజాగా మరో 10శాతం సుంకాలను పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బలహీన సంకేతాలు నెలకొనడంతో ట్రేడింగ్‌

Most from this category