STOCKS

News


పేటీఎం చేతికి 'బ్యాలెన్స్ టెక్నాలజీ'

Friday 10th August 2018
news_main1533897285.png-19138

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం తాజాగా బెంగళూరుకు చెందిన సేవింగ్స్ మేనేజ్‌మెంట్ స్టార్టప్ సంస్థ బ్యాలెన్స్ టెక్నాలజీని కొనుగోలు చేసింది. దీనికోసం ఎంత వెచ్చించిందీ పేటీఎం వెల్లడించనప్పటికీ.. డీల్ విలువ సుమారు 2 మిలియన్ డాలర్లు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. తమ యూజర్లు, వ్యాపార సంస్థల మధ్య ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపర్చేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని పేటీఎ౾ం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్ సీఎఫ్‌వో మధుర్ దేవరా తెలిపారు. యూజర్లు తమ నిర్దేశిత ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అనుసరించాల్సిన పెట్టుబడి, పొదుపు వ్యూహాలను రూపొందించుకునేందుకు తోడ్పడే సాధనాలను బ్యాలెన్స్ టెక్నాలజీ అందిస్తోంది. ఒప్పందంలో భాగంగా బ్యాలెన్స్ టెక్నాలజీకి చెందిన ఆరుగురు సిబ్బంది పేటీఎంలో చేరతారు. 



You may be interested

భారత్‌ వృద్ధి బాట పటిష్టం!

Friday 10th August 2018

న్యూయార్క్‌: భారత్‌ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. 2018-2019లో వృద్ధి 7.3 శాతమని అంచనావేయగా, 2019-2020 ఈ రేటు 7.5 శాతంగా విశ్లేషించింది. పెట్టుబడులు స్థిరరీతిన పెరుగుతుండడం, ప్రైవేటు వినియోగంలో వృద్ధి దీనికి కారణమని ఐఎంఎఫ్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది. నివేదికలో ముఖ్యాంశాలను చూస్తే... ♦ సమీప భవిష్యత్‌తో భారత్‌ స్థూల ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్‌ బాగుంది.  ♦ ద్రవ్యోల్బణం 2018-19లో 5.2 శాతంగా

ఫార్మా ఎగుమతులు అప్‌

Friday 10th August 2018

న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు మళ్లీ గాడినపడ్డాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతైన ఫార్మా ఎగుమతులు 3 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. గతేడాదిలో 17.3 బిలియన్‌ డాలర్లు (రూ.1,18,784 కోట్లు) విలువైన ఔషధ ఎగుమతులు జరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారంలో వెల్లడయింది. 2016-17 కాలంలో 16.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగగా, అంతకుముందు ఏడాదిలో 16.9 బిలియన్‌ డాలర్ల మేర ఎక్స్‌పోర్ట్స్‌ జరిగినట్లు

Most from this category