STOCKS

News


జీతాలివ్వకుంటే సహాయ నిరాకరణే

Friday 7th September 2018
news_main1536296149.png-20039

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు తాజాగా మరో చిక్కొచ్చి పడింది. జీతభత్యాలు సత్వరం చెల్లించకపోతే ‘సహాయ నిరాకరణ' తప్పదని సంస్థ యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. "జీతాలను ఆపివేయడం.. అది కూడా ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వకుండా చేయడమన్నది చాలా తీవ్రమైన విషయం. ఇందుకు సంబంధించిన పరిణామాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేం లేవనెత్తిన సమస్యలను పరిష్కరించి, సకాలంలో జీతాలు చెల్లించని పక్షంలో.. పైలట్ల సహాయ నిరాకరణకు దారి తీస్తుంది" అని జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యానికి పంపిన లేఖలో పైలట్లు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో అనవసర వ్యయాలు పెంచుకోవడంపై సైతం వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత మూడు నెలల్లో ఏర్పాటు చేసిన అనవసర హోదాలు, కమిటీలు, గ్రూప్‌లు అన్నింటినీ తక్షణం రద్దు చేయాలని, అలాగే భారీ జీతాలిచ్చి విదేశీ పైలట్లను నియమించుకోవడాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు జీతాల చెల్లింపునకు సంబంధించి పైలట్లు, ఇతర సిబ్బందితో యాజమాన్యం చర్చలు జరుపుతోందని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. పైలట్లు, ఇంజినీర్లకు వరుసగా రెండో నెల కూడా జీతాల చెల్లింపులో జాప్యం జరగడంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది. వ్యయాల నియంత్రణ చర్యల్లో భాగంగా సిబ్బంది జీతాల్లో 25 శాతం మేర కోత విధించే ప్రతిపాదనను జెట్ ఎయిర్‌వేస్ జూన్‌ ఆఖర్లో తెరపైకి తెచ్చినప్పటికీ పైలట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత  రావడంతో వెనక్కి తగ్గింది. 



You may be interested

క్రిప్టో కరెన్సీపై అధ్యయనానికి సెబీ అధికారులు

Friday 7th September 2018

-విదేశాలకు స్టడీ టూర్స్‌ నిర్వహించిన సెబీ  న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీపై అధ్యయనం కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కొందరు అధికారులను విదేశాలకు పంపింది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి విదేశాల్లో ఉన్న విధానాలు, నిబంధనలు, ఇతర అంశాలను ఈ అధికారులు అధ్యయనం చేశారని తన వార్షిక నివేదికలో సెబీ తెలిపింది. కొంత మంది అధికారులను జపాన్‌, ఇంగ్లాండ్‌, స్విట్జర్లాండ్‌లకు పంపించామని పేర్కొంది.  ఈ స్టడీ టూర్లలో ఆయా దేశాల్లో క్రిప్టో

ఫార్మాలో 1,000 మందికి లుపిన్‌ శిక్షణ

Friday 7th September 2018

 పనాజీ: ‘లెర్న్‌ అండ్‌ ఎర్న్‌’ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండేళ్లలో 1,000 మంది సైన్స్‌ విద్యార్ధులకు ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు లుపిన్‌ ప్రకటించింది. ప్లెస్‌ 12 (ఇంటర్‌)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు మూడేళ్ల ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ‘2011 నుంచి ఇప్పటివరకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 560 మంది విద్యార్ధులకు శిక్షణనిచ్చాం. 2020 నాటికి మరో 1,000 మంది ప్లెస్‌

Most from this category