STOCKS

News


ఎన్‌సీఎల్‌టీలో పతంజలి పిటిషన్‌

Saturday 25th August 2018
news_main1535172373.png-19628

న్యూఢిల్లీ: రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌ బిడ్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్‌ చేస్తూ పతంజలి ఆయుర్వేద కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. రూ.12,000 కోట్ల భారీ బ్యాంక్‌ రుణాల కారణంగా రుచి సోయా కంపెనీపై దివాలా​‍ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రుచి సోయాను టేకోవర్‌ చేయడానికి అదానీ విల్మర్‌తో పాటు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ కూడా బిడ్‌లు వేశాయి. రుచిసోయా రుణదాతలు రూ.6,000 కోట్ల అదానీ విల్మర్‌ బిడ్‌కు ఆమోదం తెలిపాయి. దీనిని ఎన్‌సీఎల్‌టీ ఆమోదించాల్సి ఉంది. అయితే రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్‌ చేస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను పతంజలి ఆయుర్వేద్‌ ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 27న(సోమవారం) విచారణ జరిగే అవకాశాలున్నాయని అంచనా. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నామని పతంజలి ప్రతినిధి ఎస్‌.కె. తిజరవాలా పేర్కొన్నారు. మరోవైపు అదానీ గ్రూప్‌ ప్రతినిధి కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. రుచి సోయాను చేజిక్కించుకోవడానికి అదానీ విల్మర్‌, పతంజలిల మధ్య దీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. అదానీ విల్మర్‌ రూ.6,000 కోట్ల మేర బిడ్‌ను దాఖలు చేయగా, పతంజలి ఆయుర్వేద కంపెనీ రూ.5,700 కోట్ల మేర్‌ బిడ్‌ను దాఖలు చేసింది. రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌ బిడ్‌కు పచ్చజెండా ఊపారు.  ఏ ప్రాతిపదికన అదానీ విల్మర్‌ బిడ్‌ను ఆమోదించారో వెల్లడించాలని పతంజలి ఆయుర్వేద్‌ ప్రశ్నించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఆర్‌పీ), శేలైంద్ర అజ్మీరకు న్యాయ సలహాదారుగా సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ నియామకాన్ని కూడా పతంజలి కంపెనీ తప్పుపట్టింది. అదానీ గ్రూప్‌నకు కూడా సిరిల్‌ అమర్‌చంద్‌ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారని వివరించింది. 



You may be interested

ఆర్‌కామ్‌కు స్వల్ప ఊరట

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఉన్న అనిల్‌ అంబానీ గ్రూపు కంపెనీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌)కు డాలర్‌ బాండ్‌ హోల్డర్ల నుంచి ఊరట లభించింది. గతేడాది 300 మిలియన్‌ డాలర్ల విలువైన బాండ్ల చెల్లింపుల్లో ఆర్‌కామ్‌ విఫలమైంది. డాలర్‌ బాండ్‌ హోల్డర్లలో 83 శాతం ఆర్‌కామ్‌ తాజా ప్రణాళికకు ఆమోదం తెలిపినట్టు కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా 118 మిలియన్‌ డాలర్ల మేర నగదును చెల్లించడంతోపాటు, 55

భారత్‌ ‍కంపెనీలకు ప్రతికూల పవనాలు: డీఅండ్‌బీ

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: భారత్‌ కంపెనీలకు ప్రస్తుతం కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) నివేదిక పేర్కొంది. వడ్డీరేట్ల పెరుగుదల, రూపాయి బలహీనతల అంశాన్ని తన నివేదికలో డీఅండ్‌బీ ప్రస్తావించింది. వడ్డీరేట్ల పెరుగుదల పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గిస్తుందని, ఇది దేశీయ డిమాండ్‌ను పెంచుతుందని పేర్కొంది. దీనితో కొంత ద్రవ్యోల్బణం సమస్యలు వస్తాయని విశ్లేషించింది. వడ్డీరేట్ల పెంపు కార్పొరేట్ల రుణ భారాన్ని పెంచే అంశమని

Most from this category