STOCKS

News


పతంజలి కింభో యాప్ మళ్లీ అందుబాటులోకి

Thursday 16th August 2018
news_main1534397451.png-19326

న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి ఆయుర్వేద తమ 'కింభో' మెసేజింగ్ యాప్‌ను మళ్లీ అందుబాటులోకి తెస్తోంది. కొంగొత్త ఫీచర్స్‌తో ఆగస్టు 27న దీన్ని రీ-లాంచ్ చేయనుంది. పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో కింభో ట్రయల్ వెర్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇతరత్రా లోపాలేమైనా ఉంటే వాటిని సరిచేసుకుని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వాట్సాప్‌ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫాంలకు పోటీగా దేశీ మెసేజింగ్ యాప్‌ కింభోను పతంజలి ఇటీవల ప్రవేశపెట్టింది. అయితే, ఇందులోని భద్రతాపరమైన లొసుగుల గురించి పలువురు సాంకేతిక నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రవేశపెట్టిన మర్నాడే మే 31న దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్ యాప్‌స్టోర్స్‌ నుంచి ఉపసంహరించింది. కేవలం టెక్నికల్ టెస్టింగ్ కోసం ఒక్కరోజుకు మాత్రమే దీన్ని ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో ఉంచినట్లు అప్పట్లో పతంజలి పేర్కొంది. రీలాంచ్ చేస్తున్న యాప్ పూర్తిగా సురక్షితమైన, స్వదేశీ మెసేజింగ్ ప్లాట్‌ఫాంగా ఉంటుందని పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా చెప్పారు. ట్రయల్ వ్యవధిలోనే లక్షల కొద్దీ సంఖ్యలో డౌన్‌లోడ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 27న కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ దీన్ని ఆవిష్కరిస్తారని తిజారావాలా వివరించారు.



You may be interested

భారీ ఎన్‌పీఏ ఖాతాలను పరిశీలిస్తున్న ఆర్‌బీఐ

Thursday 16th August 2018

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న మొండి బకాయిలకు (ఎన్‌పీఏలు) చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ తన చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 200 భారీ ఎన్‌పీఏ ఖాతాలను, వాటికి బ్యాంకులు చేసిన ప్రొవిజనింగ్‌ (నిధుల కేటాయింపు)ను పరిశీలిస్తోంది. తద్వారా ఆయా ఖాతాల వల్ల బ్యాంకులపై వాస్తవంగా ఏ మేరకు ఒత్తిడి ఉందో ఆర్‌బీఐ స్వయంగా తెలుసుకోనుంది. ఈ ఎన్‌పీఏ ఖాతాల విషయంలో బ్యాంకులు నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నాయో ఆర్‌బీఐ పరిశీలిస్తోందని ఓ

ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయం  

Thursday 16th August 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎన్నికల తరుణం, ముడిచమురు ధరల పెరుగుదల తదితర అంశాల నేపథ్యంలో ఈ ఏడాది స్టాక్‌మార్కెట్లలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని పరాగ్‌ పారిఖ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (పీపీఎఫ్‌ఏఎస్‌) చైర్మన్‌ నీల్‌ పారిఖ్‌ తెలిపారు. మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ గణనీయంగా పతనమైనప్పటికీ.. ఇప్పటికీ ఈ విభాగాల్లో కొన్ని మెరుగైన స్టాక్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంకులు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం

Most from this category