STOCKS

News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌పై వచ్చేనెల్లో పార్లమెంటరీ కమిటీ సమీక్ష

Wednesday 28th November 2018
news_main1543388434.png-22431

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ పరిస్థితులను సమీక్షించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఆర్థికాంశాలు) డిసెంబర్ 3 నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఈ సందర్భంగా గ్రూప్‌తో పాటు ఇతర ఆర్థిక సంస్థల అధికారులతో కూడా కమిటీ భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఈ ప్యానెల్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. దాదాపు రూ.94,216 కోట్ల మేర రుణభారం పేరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్ఎస్‌.. చెల్లింపులు జరపలేక చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో సంక్షోభం మరింత ముదరకుండా సంస్థ బోర్డును రద్దు చేసిన కేంద్రం.. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్ సారథ్యంలో కొత్త బోర్డును నియమించింది. ఈ బోర్డు అక్టోబర్ 31న కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి సమర్పించింది. ఈ ప్రక్రియ రెండు-మూడు త్రైమాసికాల్లో పూర్తి కావొచ్చని పేర్కొంది. ప్రణాళిక ప్రకారం ఇప్పటికే రెండు అనుబంధ సంస్థల్లో వాటాలు విక్రయించే ప్రక్రియ ప్రారంభించింది. 



You may be interested

‘విస్తరిస్తున్న’ కార్పొరేట్ల సేవ

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించిన మాదిరిగానే భారత కార్పొరేట్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తరిస్తున్నారు. దీంతో సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాల కోసం వీరు వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమం కోసం చేసిన నిధుల వ్యయం 11 శాతం పెరిగింది. రూ.10,030 కోట్లను ఇందుకు ఖర్చు చేయడం విశేషం. ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అయిన 1,795 కంపెనీల్లో

డాలర్‌ రివకరీ : నష్టాల్లో పసిడి ధర

Wednesday 28th November 2018

ఈ వారంలో రెండు రోజులు స్థిరమైన ర్యాలీ చేసిన పసిడి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడం ఇందుకు కారణమైంది. గతరాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌ సమావేశంలో ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రిచర్డ్ క్లారిడా మాట్లాడుతూ ‘‘ఫెడ్‌ క్రమక్రమంగా వడ్డీరేట్లను పెంచాలి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతైన అవసరమని’’ తెలిపారు. వడ్డీరేట్లపై పెంపుకు కొంతమేర స్పష్టత రావడంతో రాత్రి

Most from this category