STOCKS

News


ఐఎల్‌ఎఫ్ఎస్ సంక్షోభంపై ఎంక్వైరీ కమిషన్‌ వేయాలి

Thursday 14th February 2019
Markets_main1550125170.png-24191

- పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వ్యవహారంపై ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ఆర్థికాంశాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఈ వివాదంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్థాయీ సంఘం ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. "ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. సంక్షోభానికి కొన్నాళ్ల ముందే గ్రూప్ సంస్థలకు ఓవర్ రేటింగ్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీలతో పాటు గ్రూప్‌లో అతి పెద్ద వాటాదారు ఎల్‌ఐసీ సహా ఇతరత్రా సంస్థాగత వాటాదారుల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉంది" అని కమిటీ పేర్కొంది. ఇక, దేశీయంగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు భారీ స్థాయిలో రుణాలిస్తున్న కంపెనీ కావడంతో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కార్యకలాపాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించింది. కంపెనీలు ఎల్లకాలం ఒకే రేటింగ్ ఏజెన్సీని కొనసాగించేలా కాకుండా ఆడిటర్ల తరహాలో వీటికి కూడా నిర్దిష్ట కాలావధి నిర్దేశించి, రొటేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని పేర్కొంది.



You may be interested

'సింగిల్' రిటైలర్ల నిబంధనల సడలింపుపై కేంద్రం కసరత్తు

Thursday 14th February 2019

న్యూఢిల్లీ: విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లను ఆకర్షించే దిశగా నిబంధనలను సడలించాలని కేంద్రం యోచిస్తోంది. ఆయా సంస్థలు తప్పనిసరిగా 30 శాతం స్థానికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉంటుందన్న సోర్సింగ్‌ నిబంధనకు సంబంధించి కాలావధి విషయంలో కొంత వెసులుబాటునివ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను పంపింది. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందగానే, క్యాబినెట్‌ ముందు ప్రతిపాదనలు

డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ !

Thursday 14th February 2019

ఆరంభించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా !! ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రుణాలపై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను ప్రారంభించిందని సమాచారం. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించారంటూ వెబ్‌ పోర్టల్‌, కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.  ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో బీఓబీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరపాలన్న నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఆడిట్‌ను

Most from this category