మెర్క్ వాటా కొనుగోలుకు పీ అండ్ జీకి ఆమోదం
By Sakshi

ముంబై: ఫార్మా కంపెనీ మెర్క్లో 51.80 శాతం వాటా కొనుగోలుకు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1,290 కోట్లు. ఈ వాటాను పీ అండ్ జీ కి చెందిన ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఓవర్సీస్ ఇండియా బీవీ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ ఈ ఏడాది చివరకు పూర్తవ్వగలదని అంచనా. ఈ డీల్‌కు ఆర్థిక సలహాదారుగా జేపీ మోర్గాన్, న్యాయ సలహాదారుగా ఫ్రెష్ఫీల్డ్స్ బ్రక్హాస్ డెరింజర్ వ్యవహరిస్తున్నాయి. .
You may be interested
37 శాతం తగ్గిన సంఘి ఇండస్ట్రీస్ లాభం
Wednesday 8th August 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికంలో సంఘి ఇండస్ట్రీస్ నికరలాభం క్రితంతో పోలిస్తే 37 శాతం తగ్గి రూ.20 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.315 కోట్ల నుంచి రూ.283 కోట్లకు వచ్చి చేరింది. మంగళవారం బీఎస్ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 4.81 శాతం తగ్గి రూ.88.05 వద్ద స్థిరపడింది.
రూపాయి అప్..
Wednesday 8th August 201868.66 వద్ద ప్రారంభం మంగళవారం ముగింపు 68.69తో పోలిస్తే 0.05 శాతం పెరుగుదల ఇండియన్ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. దేశీ మార్కెట్లు సానుకూలముగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఉదయం 9:12 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.64 వద్ద ట్రేడ్ అవుతోంది. తన మునపటి ముగింపు 68.69తో పోలిస్తే 0.05 శాతం పెరిగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 68.66 వద్ద ప్రారంభమైంది. క్రూడ్