STOCKS

News


హోటల్‌ గదుల బుకింగ్‌పై ఓయో ఆఫర్లు

Thursday 25th October 2018
news_main1540445241.png-21462

న్యూఢిల్లీ: హోటల్‌ గదుల బుకింగ్‌, తదితర సేవల్లో ఉన్న ఓయో... ఈ ఏడాది శీతాకాలం బుకింగ్‌ల్లో రికార్డు స్థాయిలో 73 శాతం వృద్ధి నెలకొన్నట్టు ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా పర్యాటకులకు అందుబాటు ధరలకే బుకింగ్‌లకు వీలు కల్పించేందుకు ఫ్లాట్‌గా 60 శాతం తక్కువకు ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. పేటీఎం ద్వారా లావాదేవీ నిర్వహించిన వారికి మరో 40 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 24 నుంచి 31 మధ్య... డిసెంబర్‌ 1 నుంచి 31వ తేదీల మధ్య విడిది కోసం చేసే బుకింగ్‌లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని ఓయో పేర్కొంది.
 


Oyo

You may be interested

జైడస్‌ చేతికి హెంజ్‌ ఇండియా

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: కన్జూమర్ ఉత్పత్తుల సంస్థ జైడస్ వెల్‌నెస్ తాజాగా హెంజ్‌ ఇండియాను కొనుగోలు చేయనుంది. క్యాడిలా హెల్త్‌కేర్‌తో కలిసి ఈ డీల్‌ కుదుర్చుకోనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 4,595 కోట్లు. హెంజ్‌ ఇండియా కొనుగోలుతో ఎనర్జీ డ్రింక్ గ్లూకోన్‌-డీ, టాల్కం పౌడర్ బ్రాండ్ నైసిల్‌, నెయ్యి బ్రాండ్‌ సంప్రీతి మొదలైనవి తమ పోర్ట్‌ఫోలియోలోకి చేరనున్నట్లు జైడస్‌, క్యాడిలా సంస్థలు విడివిడిగా స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేశాయి.

టీవీఎస్‌ మోటార్‌ డైరెక్టర్‌, సీఈవోగా రాధాకృష్ణన్‌

Thursday 25th October 2018

చెన్నై: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ కేఎన్‌ రాధాకృష్ణన్‌ను హోల్‌టైమ్‌ డైరెక్టర్‌, సీఈవోగా నియమించింది. ఈ నెల 23 నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవుల్లో కొనసాగుతారు. రాధాకృష్ణన్‌ 1986లో టీవీఎస్‌ గ్రూపు కంపెనీ సుందరం క్లేటాన్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా చేరి బిజినెస్‌ ప్లానింగ్‌ హెడ్‌గా ఎదిగారు. 2004లో టీవీఎస్‌ మోటార్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. 2008లో ప్రెసిడెంట్‌ అయ్యారు. రాధాకృష్ణన్‌ మార్గదర్శకంలోనే కంపెనీ దేశంలో

Most from this category