STOCKS

News


రిసార్ట్స్ విభాగంలోకి ఓయో

Friday 31st August 2018
news_main1535693954.png-19821

ముంబై: హోటల్స్ చెయిన్ ఓయో తాజాగా రిసార్ట్స్‌ వంటి ఆతిథ్య రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం పాలెట్ రిసార్ట్స్ పేరిట కొత్త బ్రాండ్‌ ప్రారంభించింది. గదులు, ప్రైవేట్ విల్లాలు, బీచ్‌లు, స్పా మొదలైనవి ఆఫర్ చేసే రిసార్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఓయో పేర్కొంది. ముందుగా పాండిచేరీలోని ఒక ప్రాపర్టీతో (పాలెట్ రిసార్ట్స్‌-లె పాండీ) కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. క్రమంగా దేశవిదేశాల్లో ఇతర పర్యాటక ప్రాంతాలకు కూడా ఈ బ్రాండ్‌ను విస్తరించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 వేల పైచిలుకు అన్‌బ్రాండెడ్, బ్రాండెడ్ స్వతంత్ర రిసార్ట్స్ ఉన్నట్లు ఓయో తెలిపింది. 



You may be interested

పెరగనున్న సహజ వాయువు ధర

Friday 31st August 2018

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి 14 శాతం పైగా పెంచే అవకాశం౾ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎన్‌జీ రేట్లతో పాటు విద్యుత్‌, ఎరువుల ఉత్పత్తి వ్యయాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం యూనిట్‌కు (మిలియన్ ప్రామాణిక బ్రిటీష్ యూనిట్ - ఎంబీటీయూ) రేటు 3.06 డాలర్లుగా ఉండగా.. దీన్ని 3.5 డాలర్లకు పెంచవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

క్యూ1లో వృద్ధి 7.6 శాతం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Friday 31st August 2018

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో 7.6 శాతంగా నమోదవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. శుక్రవారం మొదటి త్రైమాసిక గణాంకాలను కేంద్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. దీనికి లో-బేస్‌ ఎఫెక్ట్‌ కారణమని వివరించింది. గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ కేవలం 5.6 శాతంగా నమోదుకావడం గమనార్హం. క్రూడ్‌ ధరల

Most from this category