STOCKS

News


ప్రపంచం నంబర్‌-1పై ఓయో కన్ను

Saturday 1st December 2018
news_main1543642634.png-22538

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద హోటల్‌ బ్రాండ్‌గా అవతరించిన ఓయో... ప్రపంచంలోనూ టాప్‌ హోటల్‌ బ్రాండ్‌గా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. గదుల సంఖ్య పరంగా దేశంలో ఓయో అగ్ర స్థానంలో ఉంది. వచ్చే నాలుగైదేళ్లలో అంతర్జాతీయంగా లక్షలాది హోటల్‌ గదులను తన నెట్‌వర్క్‌ పరిధిలో చేర్చుకోవడం ద్వారా మారియట్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్‌-1 హోటల్‌ బ్రాండ్‌గా అవతరించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన మారియట్‌ అంతర్జాతీయంగా అతిపెద్ద హోటల్‌ సంస్థగా ఉంది. ఈ సంస్థ పరిధిలో 14 లక్షల గదులున్నాయి. 2023 నాటికి మారియట్‌ను అధిగమించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్టు ఓయో హోటల్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్‌ అగర్వాల్‌ తెలిపారు. 
నాలుగున్నరేళ్లలోనే... 
ఓయో ఓ స్టార్టప్‌గా తన ప్రయాణం ఆరంభించిన నాలుగున్నరేళ్లలోనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. ఓ హోటల్‌ బ్రాండ్‌గా 20 గదులతో ప్రారంభించిన కంపెనీ ప్రస్తుతం భారత్‌, చైనా, బ్రిటన్‌ తదితర దేశాల్లో 3,30,000 హోటల్‌ గదులను నిర్వహించే అంతర్జాతీయ బ్రాండ్‌గా  (ఫ్రాంచైజీ/సొంతంగానూ) అవతరించింది. ‘‘ప్రతీ నెలా 50,000 గదులను పెంచుకుంటూ వెళుతున్నాం. ఇది పూర్తిగా అర్థవంతమైన స్థాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న హోటల్‌ చైన్‌గా ఇది మమ్మల్ని నిలిపింది’’ అని అగర్వాల్‌ తెలిపారు. ఓయో బడ్జెట్‌ హోటల్‌ చైన్‌గా తన వ్యాపారాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం మధ్య స్థాయి, ఉన్నత స్థాయి పర్యాటకులకు సైతం విడిది సేవలు అందిస్తోంది. ప్రధానంగా ఓయోకు భారత్‌, చైనా మార్కెట్లో ఎక్కువ హోటల్‌ గదులుండగా, బ్రిటన్‌, యూఏఈ, ఇండోనేషియా, మలేషియా, నేపాల్‌కూ కార్యకలాపాలను విస్తరించింది. 2023 నాటికి మరిన్ని దేశాల్లోకీ అడుగుపెట్టాలనుకుంటోంది. అయితే, తదుపరి ఏ దేశాల్లో ఓయో బ్రాండ్‌ విస్తరించనున్నదనే విషయాన్ని రితేష్‌ అగర్వాల్‌ వెల్లడించలేదు. 
సాఫ్ట్‌బ్యాంకు దన్ను
సాఫ్ట్‌బ్యాంకు సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి గత సెప్టెంబర్‌లో బిలియన్‌ డాలర్లను (రూ.7,000 కోట్లు) ఓయో సమీకరించింది. దీని ప్రకారం సంస్థ విలువ 5 బిలియన్‌ డాలర్లు (రూ.35,000 కోట్లు) అని అంచనా. 1.2 బిలియన్‌ డాలర్లను భారత్‌, చైనాలో కార్యకలాపాల విస్తరణపైనే కంపెనీ వెచ్చించింది. భారత్‌లో 1,43,000 హోటల్‌ గదులు, చైనాలో 1,80,000కుపైగా హోటల్‌ గదులను కలిగి ఉంది. గదుల సంఖ్యా పరంగా టాప్‌ టెన్‌ బ్రాండ్లలో ఓయో కూడా ఒకటి. తన భారీ విస్తరణ కోసం త్వరలో మరిన్ని నిధులను సమీకరించే ఆలోచనతోనూ ఉంది.  భారత్‌తో పోలిస్తే చైనాలో మరింత విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయని అగర్వాల్‌ తెలిపారు. చైనాలో 3.5 కోట్ల అన్‌ బ్రాండెడ్‌ హోటల్‌ గదులు అందుబాటులో ఉండగా, అదే భారత్‌లో అందుబాటులో ఉన్న అన్‌బ్రాండెడ్‌ గదులు 43 లక్షలేనని పేర్కొన్నారు. ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ అయిన ఆదిత్యఘోష్‌ను భారత్‌, దక్షిణాసియా ప్రాంతాల్లో ఓయో సంస్థకు సీఈవోగా ఇటీవలే నియమించుకున్న విషయం గమనార్హం. చైనా సహా అంతర్జాతీయంగా విస్తరణపై ఘోష్‌ దృష్టి సారించనున్నారు. You may be interested

మాస్‌ మార్కెట్లోకి బెనెల్లి

Saturday 1st December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం బైక్‌ల బ్రాండ్‌ బెనెల్లి... భారత్‌లో మాస్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తోంది. ఇందుకోసం 200 సీసీలోపు సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తేబోతోంది. అంతర్జాతీయంగా ఈ విభాగంలో కంపెనీ ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో 125 సీసీ, 150, 175 సీసీ స్కూటర్లు కూడా ఉన్నాయి. ‘‘ఇవన్నీ కూడా 2020లో భారతీయ రోడ్లపై పరుగులు పెడతాయి’’ అని బెనెల్లి ఇండియా ఎండీ

క్లిక్‌ చేస్తే సారొస్తారు!

Saturday 1st December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌ వంటివే కాదు ప్లంబర్, పెయింటర్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసే రోజులివి. అయితే వీటిల్లో ఏ సేవలకైనా సరే ఇంటికొచ్చే వ్యక్తి గురించి మనం ఎంక్వైరీ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆర్డర్లను డెలివరీ చేయటం వరకే వారి పని. మరి, హోమ్‌ ట్యూషన్స్‌ చెప్పే ట్యూటర్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటే? తల్లిదండ్రులు చాలానే ఆలోచించాలి. ఎందుకంటే ట్యూటర్‌ మేథస్సే కాదు అతని వ్యక్తిత్వం,

Most from this category