STOCKS

News


ఫిలిప్పైన్స్‌లో ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌

Thursday 31st January 2019
news_main1548918031.png-23923

  • 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతాం
  • ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సీఓఓ అభినవ్‌ సిన్హా

న్యూఢిల్లీ: ఆతిధ్య రంగ దిగ్గజం ఓయో.. ఫిలిప్పైన్స్‌ దేశంలో ప్రవేశించింది. ఆ దేశంలో కార్యకలాపాల కోసం 21 ఫ్రాంచైజ్‌డ్‌, లీజ్‌డ్‌ హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయో తెలిపింది. ప్రస్తుతం తాము భారత్‌తో పాటు చైనా, మలేషియా, నేపాల్‌, ఇంగ్లాండ్‌, యూఏఈ, ఇండోనేషియా... మొత్తం ఏడు దేశాల్లో  కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సీఓఓ అభినవ్‌ సిన్హా చెప్పారు. ఫిలిప్పైన్స్‌ తమకు ఎనిమిదో దేశమని వివరించారు. భవిష్యత్తులో ఈ దేశంలో 5 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని, వెయ్యికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిలిప్పైన్స్‌ దేశంలో 500 రూమ్స్‌ ఆఫర్‌ చేస్తున్నామని, ఈ సంఖ్యను 2020 కల్లా  పదివేలకు పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌లో 13,000 లీజ్‌డ్‌, ఫ్రాంచైజ్‌డ్‌ హోటళ్లు, 3,000 హోమ్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు.You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాల వివరాలు

Thursday 31st January 2019

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం 25% అప్‌ ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం డిసెంబర్‌ క్వార్టర్లో 25.5 శాతం వృద్ధి చెంది రూ.596 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదేకాలానికి కంపెనీ లాభం రూ.475 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ3లో ఆదాయం రూ.4,439 కోట్లు కాగా, వడ్డీ ఆదాయం రూ.4,414 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో తెలియజేసింది. వ్యయం రూ.2,908 కోట్ల నుంచి ఈసారి

సేవల విస్తృతిపై అపోలో దృష్టి

Thursday 31st January 2019

అపోలో జాయింట్‌ ఎండీ సంగీత రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆసుపత్రుల విస్తరణ కంటే సేవల విస్తృతిపైనే ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్‌ చేస్తామని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఫిక్కీ సమావేశంలో పాల్గొన్న ఆమె ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఆసుపత్రుల పరంగా దేశంలో మేమే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. అవసరమైన చోట హాస్పిటల్‌, ఫార్మసీల

Most from this category