10 లక్షల గదుల మైలురాయికి త్వరలోనే ‘ఓయో’
By Sakshi

కోల్‌కతా: ఆతిథ్య సేవల సంస్థ ఓయో హోటల్స్ అండ్ రూమ్స్ త్వరలోనే మిలియన్ గదుల (10 లక్షల గదులు) మార్క్‌ను చేరుకోనుందని ఆ సంస్థ సీఈవో (భారత్, దక్షిణాసియా) ఆదిత్య ఘోష్ తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణలో 4.6 లక్షల గదుల వసతి నిర్వహణ ఉంది. త్వరలోనే 10 లక్షల గదుల మార్క్‌ను చేరుకునేందుకు రోడ్‌మ్యాప్‌పై పనిచేస్తున్నామని ఘోష్ చెప్పారు. ఏడాదిన్నరలో ఇది సాకారం అవుతుందన్నారు. దీంతో ప్రపంచంలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఓయో మొదటి స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. తాము 2023 నాటికి 2.5 మిలియన్ల గదుల (25 లక్షలు) లక్ష్యాన్ని విధించుకున్నామని సంస్థ ప్రమోటర్ రితేష్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఓయోకు 13,000 ఫ్రాంచైజీ, లీజ్డ్ హోటల్స్, 4,50,000 గదులు ఉన్నాయి. ప్రతీ నెలా అంతర్జాతీయంగా 64,000 గదులను జత చేసుకుంటూ వెళుతోంది. భారత్‌లో 8,700 లీజ్డ్, ఫ్రాంచైజీ హోటల్స్, 1,64,000 గదులను నిర్వహిస్తున్నట్టు రితేష్ తెలిపారు. చైనాలో తమకు 1.8 లక్షల గదులు ఉన్నప్పటికీ ఆదాయం తక్కువగానే వస్తుందన్నారు. ఓయో ప్రస్తుతం ఏడు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, 15 దేశాలకు విస్తరించాలనుకుంటోంది. కస్టమర్ల రాక, పోకల వివరాలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకునేందుకు డిజిటల్ రికార్డు విధానాన్ని సంస్థ ప్రవేశపెడుతోంది. దీనిపై తెలంగాణ, రాజస్థాన్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి వ్యక్తం చేశాయని ఆదిత్య ఘోష్ తెలిపారు.
You may be interested
ఐటీ కంపెనీల టార్గెట్ ధరలు తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ
Tuesday 15th January 2019దేశీయ ఐటీ దిగ్గజాల్లో చాలా కంపెనీల టార్గెట్ ధరలను అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తగ్గించింది. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్‌మహీంద్రా, మైండ్‌ట్రీ, పెరిసిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్, ఎంఫసిస్ షేర్ల టార్గెట్లను కుదించినట్లు తెలిపింది. భారీ వాల్యూషన్ల కారణంగా టీసీఎస్, పేలవ వృద్ధి అంచనాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ టార్గెట్ ధరను తగ్గించామని వివరించింది. మరోవైపు ఇన్ఫోసిస్ లక్ష్యిత ధరను మాత్రం పెంచింది. రిస్కురివార్డు నిష్పత్తి ఆకర్షణీయంగా ఉన్నందునే
నత్తనడకన ప్యాసింజర్ వాహన అమ్మకాలు..
Tuesday 15th January 2019గడిచిన ఆరు నెలల్లో 5 నెలల అమ్మకాలు తగ్గుదల న్యూఢిల్లీ: గతేడాది రెండవ అర్థభాగంలో ప్యాసింజర్ వాహన విక్రయాలు నెమ్మదించాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) సోమవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన ఆరు నెలల్లో 5 నెలల అమ్మకాలు తగ్గుదలను నమోదుచేశాయి. అక్టోబర్ మినహాయించి మిగిలిన ఐదు నెలల్లో అమ్మకాలు తగ్గాయి. తాజాగా డిసెంబర్ విక్రయాలు 2,38,692 యూనిట్లుగా వెల్లడి కాగా, అంతక్రితం ఏడాది ఇదే నెల్లో 2,39,723 యూనిట్లు