News


9 రెట్లు పెరిగిన ఓవీఎల్‌ లాభం

Thursday 15th November 2018
news_main1542259375.png-22039

న్యూఢిల్లీ: అధిక చమురు ధరల సానుకూలతతో ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ (ఓవీఎల్‌) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మంచి పనితీరు ప్రదర్శించింది. కంపెనీ లాభం ఏకంగా 878 శాతం వృద్ధితో రూ.1,384 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.142 కోట్లు కాగా, 2017-18 పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ మొత్తం లాభం రూ.981 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభానికి మించి సెప్టెంబర్‌ క్వార్టర్లో ఓవీఎల్‌ ఆర్జించటం గమనార్హం. ముడి చమురు ఉత్పత్తి 2.6 శాతం పెరిగి 4.9 మిలియన్‌ టన్నులుగా ఉంటే, సహజ వాయువు ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 2.1 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లుగా ఉండడం గమనార్హం. ఉత్పత్తి పెరగడం, అధిక చమురు ధరలు కారణాలుగా కంపెనీ పేర్కొంది. ఓవీఎల్‌ 20 దేశాల్లో 41 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. 



You may be interested

ఐడియా నష్టాలు రూ.4,973 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: వోడాఫోన్‌ ఐడియా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.4,973 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేడెట్‌) వచ్చాయి. 42.2 కోట్ల మంది వినియోగదారులతో భారత్‌లో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించిన ఈ కంపెనీ  రూ.7,663 కోట్ల ఆదాయాన్ని (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి స్థూల రుణభారం రూ.1,26,100 కోట్లుగా ఉందని వోడాఫోన్‌ ఐడియా తెలిపింది. రూ.13,600 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయని,

పసిడి రూ. 300 జంప్‌

Thursday 15th November 2018

గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేయడంతో ఇక్కడ ఎంసీఎక్స్‌లో సైతం బుధవారం రాత్రి అంతేశాతం పెరిగింది. గత రాత్రి పెరుగుదలకు కొనసాగింపుగా గురువారం ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:15లకు ఔన్స్‌ పసిడి ధర 1.10డాలర్లు స్వల్పంగా పెరిగి 1211.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 12డాలర్ల(1శాతం)లాభపడింది. ఈ డిసెంబర్‌లో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపపై స్పష్టత రావడంతో

Most from this category