STOCKS

News


హైదరాబాద్‌ వద్ద ఎన్‌సీఎల్‌ మరో ప్లాంటు

Saturday 24th August 2019
news_main1566622392.png-27984

ప్రీ-ఇంజనీర్డ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌ తయారీ
చైనా కంపెనీ సిండావోతో జేవీ

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- సిమెంటు, బిల్డింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ రంగంలో ఉన్న ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌.. ప్రీ-ఇంజనీర్డ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని మల్కాపూర్‌ వద్ద ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. చైనాకు చెందిన సిండావో జింగ్‌జాంగ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌తో కలిసి ఈ యూనిట్‌ను స్థాపిస్తున్నారు. జేవీలో ఎన్‌సీఎల్‌కు 70 శాతం, సిండావోకు 30 శాతం వాటా ఉంటుంది. తొలి దశలో ఇరు సంస్థలు రూ.35 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. జేవీలో ఎన్‌సీఎల్‌ ఈక్విటీ కింద రూ.7.70 కోట్లు పెట్టుబడి చేస్తోంది. మల్కాపూర్‌ వద్ద ఎన్‌సీఎల్‌కు 53 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడే రూ.50 కోట్లతో డోర్స్‌ తయారీ ప్లాంటును ఇటీవలే ప్రారంభించింది. డ్యూరాడోర్‌ బ్రాండ్‌లో వీటిని తయారు చేస్తోంది. 1997లో ప్రారంభమైన సిండావో 80కిపైగా దేశాల్లో పలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. స్టీల్‌ స్ట్రక్చర్స్‌ రంగంలో చైనాలో లిస్టింగ్‌కు వెళ్లిన తొలి కంపెనీ ఇదే. 
బహుళ అంతస్తుల భవనాలకై..
ప్రీ-ఇంజనీర్డ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌ యూనిట్‌ 10 ఎకరాల్లో రానుంది. ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10,000 టన్నులని ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ కె.రవి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. తయారీ కేంద్రం కోసం 80 మందిని నియమించుకుంటాం. ఆన్‌ సైట్‌ ఉద్యోగులు 100 మంది దాకా ఉంటారు. బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవసరమైన స్టీల్‌ స్ట్రక్చర్స్‌ తయారు చేస్తాం. సిండావోకు ఈ రంగంలో అపార అనుభవం ఉంది. భారత్‌లో భవిష్యత్‌లో స్టీల్‌ స్ట్రక్చర్స్‌కు డిమాండ్‌ అధికంగా ఉండనుంది. ఈ విభాగంలో ప్రవేశించడం ద్వారా నిర్మాణ రంగంలో వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ సంస్థగా నిలుస్తాం’ అని వివరించారు. ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.288 కోట్ల టర్నోవర్‌పై రూ.29 కోట్ల నికరలాభం ఆర్జించింది. 



You may be interested

బంధన్‌ బ్యాంక్‌ నుంచి ‘కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌’..!

Saturday 24th August 2019

స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో సేవలు కోల్‌కతా: ప్రైవేట్‌ రంగానికి చెందిన బంధన్‌ బ్యాంక్‌ తమ కస్టమర్లకు ‘కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌’లను జారీ చేయనుంది. ఈ సేవలను అందించడం కోసం తాజాగా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఆ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ చంద్రశేఖర్‌ ఘోష్‌ ప్రకటించారు. మూడు వేరియంట్లలో కార్డుల జారీ కానుండగా, క్రెడిట్‌ పిరియడ్‌ 52 రోజులుగా నిర్ణయించామని ఆయన వివరించారు. ఈ అంశంపై స్టాండర్డ్‌ చార్టర్‌

అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల మోత

Saturday 24th August 2019

75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై మరో 10 శాతం బీజింగ్‌: అమెరికాకు దీటుగా చైనా స్పందించింది. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. చైనాకు చెందిన మరో 300 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లను 10 శాతం మేర అదనంగా పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

Most from this category