News


ఓరియంటల్ బ్యాంక్ లాభం రూ. 145 కోట్లు

Wednesday 30th January 2019
news_main1548825084.png-23895

- ఈఎస్‌పీఎస్‌ కింద 2.61 కోట్ల షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.145 కోట్ల నికర లాభం ప్రకటించింది. అసెట్ క్వాలిటీ, వ్యాపార నిర్వహణ సామర్ధ్యాలు మెరుగుపడటం ఇందుకు తోడ్పడ్డాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఓబీసీ రూ. 1,985 కోట్ల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 4,756 కోట్ల నుంచి రూ. 5,128 కోట్లకు పెరిగింది. త్రైమాసికాలవారీగా నికర వడ్డీ మార్జిన్లు క్రమంగా మెరుగుపర్చుకుంటూ వస్తున్నామని, 2017-18లో 1.95 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ తాజా మూడో త్రైమాసికంలో 2.80 శాతానికి చేరిందని ఓబీసీ తెలిపింది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ. 1,018 కోట్ల నుంచి రూ. 1,419 కోట్లకు పెరిగింది. ఎ౾ంప్లాయీ పర్చేజ్ స్కీమ్ (ఈఎస్‌పీఎస్‌) కింద కొత్తగా 2.61 కోట్ల షేర్లను రూ. 71.76 రేటుకు జారీ చేయనున్నట్లు ఓబీసీ తెలిపింది. జనవరి 31న ప్రకటించే ఈ ఆఫర్ ద్వారా రూ. 187.52 కోట్లు సమీకరించాలని బ్యాంక్ భావిస్తోంది.
తగ్గిన ఎన్‌పీఏలు..
క్యూ3లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 16.95 శాతం నుంచి 15.82 శాతానికి, నికర ఎన్‌పీఏలు 9.52 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గాయి. విలువపరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ. 27,551 కోట్ల నుంచి రూ. 24,353 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ. 14,195 కోట్ల నుంచి రూ. 9,973 కోట్లకు తగ్గాయి. అయితే, మొండిబాకీలకు కేటాయింపులు మాత్రం రూ. 2,340 కోట్ల నుంచి రూ. 4,082 కోట్లకు పెరిగాయి.



You may be interested

కోబ్రాపోస్ట్‌ కలకలం : డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మరో 10శాతం డౌన్‌

Wednesday 30th January 2019

నగదు బదిలీ ఆరోపణలపై కంపెనీ సీఈవో వివరణ ఇచ్చినప్పటికి దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేరు బుధవారం ట్రేడింగ్‌లో మరో 10శాతం పతనమైంది. వివిధ షెల్ కంపెనీల సాయంతో ఆ కంపెనీకి చెందిన ప్రధాన ప్రమోటర్లు రూ.31,000 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని కోబ్రాపోస్ట్‌ మంగళవారం ఆరోపణలు చేసింది. కాగా, కోబ్రాపోస్ట్‌ కథనాన్ని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖండించింది. ఆరోపణలన్నీ దురుద్దేశంతో చేసినవేనని, కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు కంపెనీ

కొన్ని ప్రధాన కంపెనీలు క్యూ3 ఫలితాలు

Wednesday 30th January 2019

బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 54% జంప్‌ న్యూఢిల్లీ: నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగానికి చెందిన బజాజ్‌ ఫైనాన్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ3 ఫలితాలను ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఆశాజనక త్రైమాసిక ఫలితాలను నమోదు చేసింది. గడేడాది మూడో త్రైమాసిక కాలంలో నికర లాభం రూ.690 కోట్లు కాగా, తాజా క్యూ3లో రూ.1,060 కోట్లను ఆర్జించి.. ఏకంగా 54 శాతం వృద్ధిరేటును సాధించింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 48

Most from this category