STOCKS

News


హైదరాబాద్‌లో ఒపో ఆర్‌అండ్‌డీ సెంటర్‌

Tuesday 2nd October 2018
news_main1538450713.png-20767

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఒపో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం త్వరలో ప్రారంభానికి కూడా సిద్ధమవుతోంది. కంపెనీకి ఇది భారత్‌లో తొలి సెంటర్‌ కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏడవది. చైనాలో నాలుగు, జపాన్‌, యూఎస్‌లో ఒక్కో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. భారత కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఉపకరణాల అభివృద్ధిలో హైదరాబాద్‌ సెంటర్‌ నిమగ్నం కానుంది. శామ్‌సంగ్‌ మేక్‌ ఫర్‌ ఇండియా ఇన్నోవేషన్స్‌ (ఆర్‌అండ్‌డీ) హెడ్‌గా పనిచేసిన తస్లీమ్‌ ఆరిఫ్‌... ఒపో ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్‌అండ్‌డీ హెడ్‌గా నియమితులయ్యారు. మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌,  డిజైన్‌, డెవలప్‌మెంట్‌లో ఆయనకు 15 ఏళ్ల అనుభవం ఉంది. చైనా తర్వాత రెండో అతిపెద్ద ఆర్‌అండ్‌డీ కేంద్రంగా హైదరాబాద్‌ సెంటర్‌ను తీర్చిదిద్దనున్నట్టు ఒపో వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌ కాలంలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో 10 శాతం వాటాతో కంపెనీ నాల్గవ స్థానంలో ఉంది.



You may be interested

జీఎంఆర్‌ చేతికి నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌!

Tuesday 2nd October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు అత్యధిక మొత్తాన్ని కోట్‌ చేసిన బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాగ్‌పూర్‌లోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధి, కార్యకలాపాలు, నిర్వహణను అత్యధిక మొత్తం కోట్‌ చేసిన కంపెనీ చేపడుతుంది. 30 ఏళ్ల నిర్వహణతో పాటు ప్రాజెక్టులో భాగంగా కొత్తగా టెర్మినల్‌ను నిర్మించాల్సి ఉంటుంది. జీవీకే సైతం నాగ్‌పూర్‌

అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ 'గ్లీవెక్' ఔషధం

Tuesday 2nd October 2018

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇమాటినిబ్ మెసిల్యేట్ ట్యాబ్లెట్స్‌ను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్‌) వెల్లడించింది. నొవార్టిస్‌ ఫార్మాకి చెందిన గ్లీవెక్‌ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్‌. అమెరికాలో గ్లీవెక్‌ బ్రాండ్‌, జనరిక్‌ వార్షిక అమ్మకాలు సుమారు 868 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మరోవైపు, అమెరికాలోని బ్రిస్టల్‌లో తమకున్న యాంటీబయోటిక్ తయారీ కేంద్రాన్ని నియోఫార్మాకు విక్రయించే డీల్ పూర్తయినట్లు డీఆర్‌ఎల్ తెలిపింది. అటు యాంటీబ్యాక్టీరియల్ ఉత్పత్తి డీఎఫ్‌ఏ-02కి

Most from this category