STOCKS

News


‘గ్రేడ్‌ అప్‌’తో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ ఈజీ

Saturday 16th March 2019
news_main1552721184.png-24639

‘గ్రేడ్‌ అప్‌’తో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ ఈజీ
– త్వరలోనే ఒలంపియాడ్, ఎన్‌టీఎస్‌ఈ పరీక్షల కంటెంట్‌
– ప్రస్తుతం 50కి పైగా ఎగ్జామ్స్‌; 1.3 కోట్ల మంది విద్యార్థులు
– తెలుగు రాష్ట్రాల్లో గేట్, ఇంజనీరింగ్‌ స్టూడెంట్సే అధికం
– ఈ ఏడాది రూ.100 కోట్ల నిధుల సమీకరణ
– ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ శోభిత్‌ భట్నాగర్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:
‘‘దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ స్టార్టప్‌ ‘గ్రేడ్‌ అప్‌’.. త్వరలోనే ఒలంపియాడ్, నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ (ఎన్‌టీఎస్‌ఈ) వంటి స్కూల్‌ లెవల్‌ జాతీయ ప్రవేశ పరీక్షల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. పాఠశాల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ సిలబస్, మోడల్‌ పేపర్స్, లైవ్‌ క్లాసెస్, మాక్‌ టెస్ట్‌ల వంటి కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మరిన్ని వివరాలు గ్రేడ్‌ అప్‌ కో–ఫౌండర్‌ శోభిత్‌ భట్నాగర్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.
దేశంలో ఏటా 3 కోట్ల మంది విద్యార్థులు వివిధ రకాల ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలు కావచ్చు. పై చదువుల ప్రవేశ పరీక్షలు కావొచ్చు.. ఏవైనా సరే ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌ ఎంత ముఖ్యమో కంటెంట్‌ అందుబాటులో ఉండటమూ అంతే ముఖ్యం. విద్యార్థులకు ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ను సులభతరం చేయడమే లక్ష్యంగా 2015 సెప్టెంబర్‌లో రూ.15 లక్షల పెట్టుబడితో నోయిడా కేంద్రంగా సంజీవ్‌ కుమార్, విభు భూషణ్‌లతో కలిసి గ్రేడ్‌ అప్‌ను ప్రారంభించాం.
50కి పైగా ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌..
ప్రస్తుతం ఐఐటీ, జేఈఈ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీ, బ్యాంకింగ్‌ వంటి 50కి పైగా ప్రవేశ పరీక్షల కంటెంట్‌ అందుబాటులో ఉంది. ఆయా ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ మెటీరియర్స్, మోడల్, ప్రాక్టీస్‌ పేపర్స్‌ వంటివన్నీ ఉంటాయి. అన్నీ ఉచితమే. ప్రస్తుతం ప్రవేశ పరీక్షల కంటెంట్‌ ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఏడాదిలో తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం.
హైదరాబాద్‌ వాటా 30 శాతం..
ప్రస్తుతం 2500 నగరాల నుంచి 1.3 కోట్ల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇందులో పెయిడ్‌ యూజర్లు 2.5 లక్షల మంది ఉంటారు. హైదరాబాద్‌ వాటా 30 శాతం ఉంటుంది. ప్రస్తుతం నెలకు 25 లక్షల మంది విద్యార్థులు మా సేవలను వినియోగించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి గేట్, ఇంజనీరింగ్‌ వంటి టెక్నికల్‌ సబ్జెక్ట్స్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్ష విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు.
లైవ్‌ క్లాస్‌లు, మాక్‌ టెస్ట్‌లు..
మాక్‌ టెస్ట్‌లు, లైవ్‌ క్లాస్‌లు మాకు ఆదాయ మార్గాలు. మాక్‌ టెస్ట్‌ ధరలు రూ.200–1000, లైవ్‌ క్లాస్‌లకు రూ.300–20 వేల వరకున్నాయి. ఏడాదిలో మూడింతలు ఆదాయాన్ని లక్ష్యించాం. కంటెంట్‌ ప్రిపరేషన్‌ కోసం ఆయా విభాగాల్లో పదిహేనేళ్ల అనుభవం ఉన్న 60 మంది నిపుణులున్నారు. ఫ్రీనాల్సర్స్‌గా మరొక 300 మందితో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే లా, నీట్, సీటీఈటీ, ఆర్‌ఆర్‌బీ కంటెంట్‌ను జోడించనున్నాం. వచ్చే ఏడాది కాలంలో 7 లక్షల మంది పెయిడ్‌ యూజర్లకు చేరుకోవాలని లక్ష్యించాం. ఇప్పటివరకు గ్రేడ్‌ అప్‌లో 60 లక్షల పరీక్షలు నిర్వహించాం.
ఈ ఏడాది రూ.100 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం మా కంపెనీలో 150 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో మరొక 50 మందిని నియమించుకుంటాం. గత రెండున్నరేళ్లలో నాలుగు రౌండ్లలో కలిపి ఢిల్లీకి చెందిన పలువురు ఇన్వెస్టర్లు రూ.47 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.100 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటు పలువురు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయని’’ శోభిత్‌ వివరించారు.

 You may be interested

​‍బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్విట్‌ చేతికి ముకేశ్‌ అంబానీ ఈస్ట్‌ వెస్ట్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌

Saturday 16th March 2019

డీల్‌ విలువ రూ.13,000 కోట్లు  న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన నష్టాల్లో నడుస్తున్న ఈస్ట్‌-వెస్ట్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌  చేతులు మారుతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్యాస్‌ను వినియోగదారులకు సరఫరా చేసే ‘పైప్‌లైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీని బ్రూక్‌ఫీల్డ్‌ నేతృత్వంలోని ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  ట్రస్ట్‌(ఇన్విట్‌) కొనుగోలు చేయనున్నది. ఈ కంపెనీలో వంద శాతం వాటాను రూ.13,000 కోట్లకు బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్విట్‌ కొనుగోలు చేయనున్నదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి గుజరాత్‌లోనిన

బంధన్‌ బ్యాంక్‌ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌ !

Saturday 16th March 2019

న్యూఢిల్లీ: బంధన్‌ బ్యాంక్‌లో గృహ్‌ ఫైనాన్స్‌ విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆర్‌బీఐ తమకు లేఖ రాసిందని బంధన్‌  బ్యాంక్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన అందుబాటు ధరల్లో గృహాలకు రుణాలందించే గృహ్‌ ఫైనాన్స్‌ను కోల్‌కతాకు చెందిన బంధన్‌ బ్యాంక్‌ ఈ జనవరిలో టేకోవర్‌ చేసింది. షేర్ల మార్పిడి విధానంలో ఈ టేకోవర్‌ జరిగింది. ఈ డీల్‌ కారణంగా బంధన్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ బంధన్‌

Most from this category