ఓఎన్జీసీ విదేశ్కు సర్వీస్ ట్యాక్స్ నోటీసులు
By Sakshi

న్యూఢిల్లీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్(ఓఎన్జీసీ) విదేశీ అనుబంధ సంస్థ ఓఎన్జీసీ విదేశ్(ఓవీఎల్)కు పరోక్ష పన్నుల శాఖ నోటీసులు జారీచేసింది. గడిచిన దశాబ్ద కాలంలో చెల్లించాల్సిన పన్నులను ఎందుకు చెల్లించలేదని ప్రశ్నిస్తూ.. డిమాండ్, షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 2006 నుంచి 2017 మధ్యకాలంలో విదేశీ అనుబంధ సంస్థలు ఓవీఎల్‌కు సేవలు అందించినప్పటికీ, ఇందుకు సంబంధించిన సేవాపన్ను ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. కంపెనీ తన ఆర్థిక నివేదికలలో ప్రకటించిన విదేశీ కరెన్సీ వ్యయం ఆధారంగా రూ.7,666 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
You may be interested
5జీ సేవల కోసం సాఫ్ట్‌బ్యాంక్‌తో బీఎస్ఎన్ఎల్ జట్టు
Monday 24th September 2018న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెలికం సేవలు ప్రవేశపెట్టే దిశగా జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్, ఎన్టీటీ కమ్యూనికేషన్స్‌తో ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ చేతులు కలిపింది. ప్రధానంగా స్మార్ట్ సిటీలకు అవసరమయ్యే సొల్యూషన్స్‌ను రూపొందించే క్రమంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. పోటీ సంస్థలు 4జీ సర్వీసుల ద్వారా ఆదాయాలు ఆర్జించే పనిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో 5జీ సేవలకు సంబంధించి దిగ్గజ సంస్థలు
ఫెడ్ నిర్ణయం, రూపాయి కదలికలే కీలకం..!
Monday 24th September 2018న్యూఢిల్లీ: ఈవారంలో సూచీలు మరింత కన్సాలిడేషన్‌కు గురికావచ్చని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, డాలరు విలువ బలపడుతుండడం, ద్రవ్యలోటు వంటి పలు ఆందోళనకర అంశాల నేపథ్యంలో మార్కెట్ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) సమావేశం ఈవారంలో అత్యంత కీలక అంశంగా ఉంది. మన మార్కెట్లలో దిద్దుబాటు