STOCKS

News


ఆయిల్‌, చమురు బ్లాక్‌ల వేలం...

Monday 10th June 2019
news_main1560152406.png-26196

  • ఓఎన్‌జీసీ, వేదాంత, ఆయిల్‌ ఇండియా టాప్‌
  • ఈ మూడింటికే 30 బ్లాక్‌లు
  • రిలయన్స్‌, బీపీకి కేజీ బేసిన్‌ బ్లాక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ఇండియా, ఓఎన్‌జీసీతోపాటు అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌ తాజాగా ముగిసిన చమురు, గ్యా్స్‌ బ్లాక్‌ల వేలంలో టాప్‌-3గా నిలిచాయి. రెండో దశ ఓపెన్‌ యాక్రేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ) కింద 14 ఆయిల్‌, గ్యాస్‌ బ్లాక్‌లు, మూడో దశ ఓఏఎల్‌పీ కింద మరో 18 ఆయిల్‌, గ్యాస్‌, 5 కోల్‌బెడ్‌ మీథేన్‌ బ్లాక్‌లను కేంద్రం ప్రభుత్వం వేలానికి ఉంచింది. వీటిల్లో ఆయిల్‌ ఇండియాకు 12, ఓఎన్‌జీసీకి 9, వేదాంతకు తొమ్మిది చొప్పున మొత్తం 30 బ్లాక్‌లు ఈ మూడు కంపెనీలకే దక్కనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్‌-బీపీ సంయుక్తంగా కృష్టా గోదావరి బేసిన్‌ (కేజీ బేసిన్‌)లో ఓ ‍బ్లాక్‌ను దక్కించుకోనున్నాయి. ఈ బ్లాక్‌ను ఓఎన్‌జీసీ కంటే మించి బిడ్‌ చేయడం ద్వారా రిలయన్స్‌-బీపీలు దక్కించుకోవడం విశేషం.  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ వివిధ కంపెనీలు సమర్పించిన బిడ్లను పరిశీలన పూర్తి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఓఎన్‌జీసీ, వేదాంత తొమ్మిది బ్లాకుల్లో టాప్‌ బిడ్డర్లుగా, 12 బ్లాక్‌ల్లో ఆయిల్‌ ఇండియా టాప్‌లో ఉన్నట్టు చెప్పాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం అనంతరం విజేతలను ప్రకటించనున్నట్టు తెలిపాయి. 2017 జూలైలో కేంద్రం నూతనంగా ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కంపెనీలు తమంతట తామే ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి విషయంలో ఆసక్తిని తెలియజేయవచ్చు. కంపెనీల నుంచి వచ్చిన ఆసక్తులకు అనుగుణంగా ఆయా ప్రాంతాలను ప్రభుత్వం వేలానికి ఉంచుతుంది. తొలి దశ ఓఏఎల్‌పీలో 55 బ్లాకులకు గాను వేదాంత అత్యధికంగా 41 బ్లాక్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. 



You may be interested

రిలయన్స్‌ పవర్‌కు రూ.3,558 కోట్ల నష్టం

Monday 10th June 2019

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ మార్చి త్రైమాసికంలో రూ.3,558.51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.189 కోట్ల లాభం రావడం గమనార్హం. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,952 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంత్రక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.840 కోట్లుగా ఉంది. డిబెంచర్ల జారీ ద్వారా నిధులు సమీకరించాలని ఈ నెల 8న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. 

ఆధార్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ.2లక్షల రుణం

Monday 10th June 2019

ప్రభుత్వరంగ సంస్థలకు ‍స్వయంప్రతిపత్తి మోదీ సర్కారుకు అనిల్‌ అగర్వాల్‌ సూచనలు న్యూఢిల్లీ: వేదాంత లిమిటెడ్‌ అధినేత అనిల్‌ అగర్వాల్‌ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు కీలక సూచనలు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని, ఆధార్‌ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.2లక్షల చొప్పున రుణం ఇవ్వాలని ప్రధానంగా సూచించారు. దీనివల్ల ప్రభుత్వరంగ సంస్థలు మూడు

Most from this category