STOCKS

News


ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

Wednesday 14th August 2019
news_main1565760816.png-27753

  • ఆదాయం రూ.26,555 కోట్లు

న్యూఢిల్లీ: తగ్గిన  చమురు ధరల ప్రభావం ఓఎన్‌జీసీ లాభాలపై పడింది. అయినప్పటికీ లాభాల క్షీణతను 4 శాతానికి పరిమితం చేసి జూన్‌ క్వార్టర్‌లో రూ.5,904 కోట్లను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,144 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం 2.4 శాతం తగ్గి రూ.26,555 కోట్లకు పరిమితం అయింది. ప్రతీ బ్యారెల్‌ చమురును ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా రూ.66.30 డాలర్లను ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది ప్రతీ బ్యారెల్‌పై 71.49 డాలర్లుగా ఉంది. సహజ వాయివు ధర మాత్రం ప్రతీ మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌పై 3.69 డాలర్లకు పెరిగింది. చమురు ఉత్పత్తి 5 శాతం వరకు తగ్గి 4.8 మిలియన్‌ టన్నులుగా ఉందని, దీర్ఘకాలంగా ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రాల్లో ఉత్పత్తి సహజంగానే తగ్గిందని తెలిపింది. సహజ వాయివు ఉత్పత్తి మాత్రం 4 శాతం పెరిగి 6.15 బిలియన్‌ క్యుబిక్‌ మీటర్లుగా ఉన్నట్టు వెల్లడించింది. జూన్‌ త్రైమాసికంలో కొత్తగా నాలుగు క్షేత్రాల్లో నిక్షేపాలను గుర్తించినట్టు తెలిపింది. 



You may be interested

అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

Wednesday 14th August 2019

జూలైలో 3.15 శాతం ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయిలోనే కట్టడి న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో వినియోగ ధరల సూచీలో పేర్కొన్న వస్తువులు, ఉత్పత్తుల బాస్కెట్‌ ధర మొత్తం కేవలం 3.15 శాతమే పెరిగిందన్నమాట. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత స్థాయిలోనే రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం కొనసాగుతుండడం గమనార్హం. 2 శాతానికి ప్లస్‌

కారు.. కుదేలు..

Wednesday 14th August 2019

జూలైలో 19 శాతం పడిపోయిన అమ్మకాలు  19 ఏళ్లలో ఇదే భారీ  క్షీణత 15,000 ఉద్యోగాలకు కోత సియామ్‌ గణాంకాల్లో వెల్లడి ప్యాకేజీ కోసం పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ మందగించడం ఆటోమొబైల్‌ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. జూలైలో వాహన విక్రయాలు ఏకంగా 18.71 శాతం క్షీణించాయి. గడిచిన 19 ఏళ్లలో ఇంత భారీగా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలతో ఆటోమొబైల్‌ రంగంలో ఉద్యోగాల్లో కూడా కోత పడుతోంది.

Most from this category