STOCKS

News


పవన్‌ హన్స్ వాటా విక్రయానికి ఓకే

Tuesday 7th August 2018
news_main1533618596.png-18994

న్యూఢిల్లీ: ప్రీమియర్ హెలీకాప్టర్ క్యారియర్ సంస్థ పవన్‌ హన్స్‌లో ఓఎన్‌జీసీకి ఉన్నటువంటి 49 శాతం వాటా విక్రయానికి కంపెనీ బోర్డ్‌ అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి పవన్‌ హన్స్‌లో ఉన్న 51 శాతం వాటాతో కలిపి మొత్తం ఒకేసారి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ప్రైవేటు సంస్థకు అమ్మివేయడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు మార్గం సుగమమైంది. గడిచిన పది నెలల్లో పవన్‌ హన్స్‌లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 51 శాతం వాటాలను రెండు సార్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమవగా.. ఈసారి ఓఎన్‌జీసీ వాటాను కూడా కలిపి వంద శాతం ఒకేసారి అమ్మేందుకు చేయనున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తిపై దృష్టిసారించి ఇతర వ్యాపారాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నామని.. ఇందులో భాగంగానే పవన్‌ హన్స్‌లో వాటా విక్రయిస్తున్నామని ఓఎన్‌జీసీ బోర్డ్‌ తెలిపింది. తమ వద్ద ఉన్నటువంటి 22 హెలీకాప్టర్లలో కేవలం ఏడు మాత్రమే పవన్‌ హన్స్‌కు చెందినవి కాగా, మిగిలిన వాటిని లీజుపై నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు పవన్‌ హన్స్‌కు 46 హెలీకాప్టర్లు ఉన్నాయి. You may be interested

అరవింద్‌ ఆదాయం రూ.2,875 కోట్లు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: టెక్స్‌టైల్‌, దుస్తుల దిగ్గజ  కంపెనీ ఆరవింద్‌  ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.64 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.57 కోట్లుతో పోల్చితే 13 శాతం వృద్ధి సాధించామని అరవింద్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.2,608 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.2,875 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఏడాది జూలై నుంచి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్ల పెంపు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. రిజర్వ్‌ బ్యాంకు ఎంపీసీ ఇటీవలే పావు శాతం మేర కీలక రేట్లను పెంచడంతో, హెచ్‌డీఎఫ్‌సీ సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 6 నెలల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు, పలు కాల వ్యవధుల డిపాజిట్లపై 0.6 శాతం వరకు పెంచింది. ఈ పెంచిన రేట్లు సోమవారం నుంచే అమల్లోకి

Most from this category