STOCKS

News


ఓఎంసీలు ఇంకా బలహీనమే!

Saturday 6th October 2018
news_main1538821266.png-20929

మానస్‌ జైస్వాల్‌
చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు ఇంకా బలహీనంగా కనిపిస్తున్నాయని మార్కెట్‌ నిపుణుడు మానస్‌ జైస్వాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తాజాగా ఈ కంపెనీలపై పెట్రో భారం మోపడంతో రెండు రోజుల్లో ఈ షేర్లు దాదాపు 35 శాతం వరకు పతనమయ్యాయి. అయితే ఈ కరెక‌్షన్‌ ఇంకా ముగిసిపోలేదని, మరో 10- 15 శాతం వరకు పతనం ఉండొచ్చని మానస్‌ చెప్పారు. ఈ కంపెనీల్లో కొత్తగా లాంగ్స్‌ తీసుకోవాలంటే మరి కొంత కాలం ఆగమని సూచించారు. మరో 15 శాతం పతనమైన తర్వాత ఈ స్టాకుల్లో కాంట్రా బయింగ్‌ చేయవచ్చన్నారు. ఒకవేళ ఇప్పటికే లాంగ్స్‌ తీసుకొని ఉంటే కొంత బౌన్స్‌ కనిపించే వరకు వేచిచూసి ఎగ్జిట్‌ కావడం మంచిదన్నారు. హెచ్‌పీసీఎల్‌లో 200 రూపాయల వరకు బౌన్స్‌ బ్యాక్‌ ఉండొచ్చని అంచాన వేశారు. మార్కెట్లో సైతం బలహీనత కొనసాగుతుందని మానస్‌ చెప్పారు. ఇకపై 200 రోజుల డీఎంఏ స్థాయి కీలక నిరోధంగా పనిచేస్తుందన్నారు. చార్టుల ప్రకారం నిఫ్టీ 9800 పాయింట్ల వరకు దిగజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికే నిఫ్టీ భారీ పతనం చూసినందున చిన్న పాటి రికవరీ ఉంటుందని, అనంతరం తిరిగి కరెక‌్షన్‌ కొనసాగుతుందని తెలిపారు. రికవరీల్లో లాంగ్స్‌ తీసుకోవద్దని, సెల్‌ ఆన్‌ రైజ్‌ సూత్రం పాటించాలని సలహా ఇచ్చారు. నిఫ్టీ రికవరీ 10400- 10500 పాయింట్ల వరకు ఉంటుందని, అనంతరం 9800- 9700 పాయింట్ల వరకు పతనం ఉండొచ్చని చెప్పారు. నిఫ్టీ 10800 పాయింట్లను దాటితే బుల్లిష్‌గా మారుతుందన్నారు. You may be interested

ఆరు నెలల కోసం పది సిఫార్సులు

Monday 8th October 2018

వచ్చే ఆరేడు నెలల కాలంలో దాదాపు 30 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. చార్ట్‌వ్యూ ఇండియా రికమండేషన్లు 1. అశోక్‌ లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 12. స్టాప్‌లాస్‌ రూ. 103. కొన్నిరోజులుగా ప్రధాన సూచీలు బాగా పతనమవుతున్నా, ఈ షేరు మాత్రం స్వల్ప క్షీణతనే నమోదు చేస్తోంది. మానిటరీ పాలసీలో రేట్లు పెంచకపోవడం పాజిటివ్‌ అంశం. రూ. 110 పైన స్థిరంగా కదలాడితే

రీబౌన్స్‌ ఉంటుందా?

Saturday 6th October 2018

ఈ వారం బుల్స్‌కు పీడకలగా మిగిలిపోనుంది. కేవలం బుల్స్‌కు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి, నియంత్రణా సంస్థలకు సైతం ఈ వారం చేదు అనుభవాలను మిగిల్చింది. రూపీ పతనాన్ని, క్రూడాయిల్‌ ప్రభావాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ, సెబి పలు యత్నాలు చేశాయి. అయితే వారాంతానికి అవన్నీ ప్రయోజనం చేకూర్చకుండా పోయాయి. రూపాయి 74 స్థాయిని తాకింది. నిఫ్టీ 10400 పాయింట్లను సైతం కోల్పోయింది. అయితే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు కొత్త బోర్డు ఏర్పాటు, ఓఎంసీలకు

Most from this category