STOCKS

News


‘వోగో’లో వోలా రూ.720 కోట్ల పెట్టుబడి

Wednesday 19th December 2018
news_main1545194142.png-23066

న్యూఢిల్లీ: క్యాబ్‌ సేవల సంస్థ ఓలా, స్కూటర్ల షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘వోగో’లో 100 మిలియన్‌ డాలర్లను (రూ.720 కోట్లు) ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడులను నేరుగా అందించకుండా, లక్ష స్కూటర్లను వోగోకు అందించనుంది. దీనివల్ల వోగో తన కార్యకలాపాల విస్తరణకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం రాకుండా స్కూటర్ల సరఫరాను పెంచుకోనుంది. వోగో స్కూటర్ల సేవలు ఓలా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న 15 కోట్ల మంది కస్టమర్లకు త్వరలో అందుబాటులోకి రానున్నట్టు ఓలా ప్రకటించింది. You may be interested

మాల్యా దివాలా కేసు ఇక బ్రిటన్‌ హైకోర్టులో

Wednesday 19th December 2018

లండన్‌: మాజీ లిక్కర్‌ వ్యాపారి, బ్యాంకులకు భారీగా బకాయి పడిన విజయ్‌ మాల్యా బ్రిటన్‌ హైకోర్టులో వచ్చే ఏడాది దివాలా పిటిషన్‌పై విచారణను ఎదుర్కోనున్నారు. మాల్యా సుమారు రూ.9,000 కోట్లకు పైగా భారత బ్యాంకులకు బకాయి పడిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 13 బ్యాంకుల కమిటీ ఇప్పటికే మాల్యాకు సంబంధించి ఆస్తుల జప్తు కేసును నెగ్గింది. బ్రిటన్‌కు చెందిన టీఎల్‌టీ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ కేసు వ్యవహారాలు చూసింది.

రిఫైనరీల ఏర్పాటుపై సౌదీతో రిలయన్స్‌ చర్చలు

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: కొత్త పెట్టుబడులకు సంబంధించి సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచ అతిపెద్ద చమురు ఎగుమతి సంస్థ ‘సౌదీ ఆరామ్‌కో’తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చర్చలను కొనసాగిస్తోంది. ముకేష్ అంబానీ కుమార్తె ఈశా వివాహానికి హాజరైన సమయంలో రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ఏర్పాటుపై అంబానీతో చర్చించినట్లు సౌదీ అరేబియా ఆయిల్‌ శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీహ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఉమ్మడి పెట్టుబడులు.. పెట్రోకెమికల్, రిఫైనింగ్, కమ్యూనికేషన్స్ ప్రాజెక్టులలో సహకారంపై ఆయనతో

Most from this category