News


ఓలాకు రూ.520 కోట్ల పెట్టుబడులు

Friday 11th January 2019
news_main1547185377.png-23523

సమకూర్చిన స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌ మారిషస్‌  న్యూఢిల్లీ: ట్యాక్సీ అగ్రిగేటర్‌, ఓలాలో స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌ మారిషస్‌ సంస్థ రూ.520 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. మొత్తం 2.45 లక్షల సిరీస్‌ జే ప్రిఫరెన్స్‌ షేర్లను ఒక్కోటీ రూ.21,250 చొప్పున జారీ చేసి ఈ నిధులు సమీకరించామని కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ (ఓలాను ఈ కంపెనీయే నిర్వహిస్తోంది) నివేదించింది. ఈ మేరకు ఈ నెల 9న జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించిందని  ఏఎన్‌ఐ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వంద కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించడంలో భాగంగా ఓలా సంస్థ ఈ నిధులు సేకరించింది.
గత ఆక్టోబర్‌లో 110 కోట్ల డాలర్లు..
చైనాకు చెందిన టిన్సెంట్‌ హోల్డింగ్స్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ల నుంచి 110 కోట్ల డాలర్ల నిధులను సమీకరించామని గత ఏడాది అక్టోబర్‌లో ఓలా వెల్లడించింది. మరో వంద కోట్ల డాలర్ల సమీకరణ కోసం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని అప్పుడే ఓలా పేర్కొంది. అమెరికాకు చెందిన ఉబెర్‌ కంపెనీ భారత్‌లో ఓలాకు గట్టిపోటీనిస్తోంది. ఫుండ్‌పాండా ద్వారా ఓలా ఆహార పదార్ధాల డెలివరీ సేవలను కూడా అందిస్తోంది.



You may be interested

జపాన్‌తో కరెన్సీ మార్పిడి ఒప్పందం

Friday 11th January 2019

పచ్చజెండా ఊపిన కేం‍ద్ర కేబినెట్‌ కరెన్సీ విలువల్లో అస్థిరతలు తగ్గించడమే లక్ష్యం న్యూఢిల్లీ: జపాన్‌, భారత్‌ మధ్య మరో కీలక ఒప్పందానికి వీలుగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్‌ పెట్టేందుకు గాను జపాన్‌తో 75 బిలియన్‌ డాలర్ల మేర ద్వైపాక్షిక స్వాప్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీ ఆమోదం తెలిపింది. రెండు దేశాల మధ్య గరిష్టంగా 75 బిలియన్‌ డాలర్ల

సమీపకాలం ‘‘బంగారమే’’

Friday 11th January 2019

ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి డాలర్‌ వరకూ.. పసిడి డిమాండ్‌ పెరుగుదలకు దోహదం వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా- ముంబై: బంగారం డిమాండ్‌ సమీప కాలంలో పటిష్టంగా ఉంటుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక సూచిస్తోంది.   ఈ ఏడాది (2019) డిమాండ్‌ పెరుగుదలకు పలు కారణాలు ఉంటాయని డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్‌ మార్కెట్ల పనితీరు, భారత్‌సహా పలు దేశాల ద్రవ్య పరపతి విధానాలు, డాలర్‌

Most from this category