STOCKS

News


దేశవ్యాప్తంగా 60 ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లు

Saturday 22nd December 2018
news_main1545449798.png-23146

న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 60 ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద కొత్తగా 5.87 కోట్ల కనెక్షన్లు మంజూరైన నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరా కోసం బాట్లింగ్ సామర్ధ్యం మరింత పెంచుకోవాల్సి ఉందన్నారు. చిన్న స్థాయిలో ఏర్పాటయ్యే 60 ప్రైవేట్ బాట్లింగ్ ప్లా్ంట్లలో ఇండియన్ ఆయిల్‌ 21 ప్లాంట్లను, భారత్ పెట్రోలియం 20, హిందుస్తాన్ పెట్రోలియం 19 ప్లాంట్ల సర్వీసులను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలియజేశారు. సాధారణ బాట్లింగ్ యూనిట్ వార్షిక సామర్ద్యం 1,20,000 టన్నులుగా ఉంటుండగా, ప్రైవేట్ రంగంలోని చిన్న బాట్లింగ్ ప్లాంట్ల సామర్ధ్యం వార్షికంగా 30,000 టన్నులుగా ఉంటుంది. దేశీయంగా ఎల్‌పీజీ వినియోగం వచ్చే ఏడాది 6-8 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు సింగ్ చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఇప్పటిదాకా ఇండియన్ ఆయిల్ 2.75 కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 



You may be interested

గ్రాముకు రూ. 3,119 ధర..

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేసే పసిడి బాండ్ల సిరీస్‌కు సంబంధించి గ్రాముకు రూ.3,119 ధరను కేంద్రం నిర్ణయించింది. 2018-19 సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌లో నాలుగో సిరీస్ కింద బాండ్ల జారీ డిసెంబర్ 24న ప్రారంభమై 28న ముగుస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి, డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపేవారికి ఇష్యూ ధరలో గ్రాముపై రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన వారికి గ్రాము

మళ్లీ మోదీయే... విశ్లేషకుల అంచనాలు

Friday 21st December 2018

ఈ ఏడాది ఎన్ని ఎత్తు పల్లాలను చవిచూసినా... చివరికి బుల్స్‌దే పై చేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే 2018 ముగియడానికి మరో వారమే మిగిలి ఉండగా, ఇప్పటి వరకు చూసుకుంటే మార్కెట్లు నికరంగా లాభాల్లో ఉన్నట్టే. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం మూడింట రెండొంతులు నష్టాల్లోనే ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు మార్కెట్లు తిరిగి ఎప్పుడు ర్యాలీ చేస్తాయా? అని కళ్లల్లో వొత్తులు వేసుకుని చూస్తున్న పరిస్థితి ఉంది.

Most from this category