STOCKS

News


రీట్‌ కిందకు 35 బిలియన్‌ డాలర్ల కార్యాలయ స్థలాలు

Thursday 25th April 2019
news_main1556162473.png-25338

జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ల (రీట్‌) కింద భవిష్యత్తులో అన్ని రకాల వాణిజ్య ఆస్తులు లిస్టింగ్‌కు వచ్చే వీలుందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది. భారత్‌లో ప్రస్తుతం 35 బిలియన్‌ డాలర్ల విలువైన కార్యాలయ స్థలాలు రీట్‌ కింద లిస్టింగ్‌కు అర్హత కలిగినవని ఈ సంస్థ తాజాగా ఒక నివేదికలో తెలిపింది. అద్దెలొచ్చే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను రీట్‌ కలిగి ఉంటుంది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వాటాదారులకు అద్దెల రూపంలో వచ్చిన ఆదాయం నుంచి లాభాల పంపిణీ జరుగుతుంది. ఇటీవలే ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ ఐపీవో ద్వారా దేశంలో తొలి రీట్‌ను లిస్ట్‌ చేసింది. ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. దీని ద్వారా రియల్‌ఎస్టేట్‌ ఆస్తులు వ్యవస్థీకృతం కావడం అనేది ఈ రంగం మరింత వృద్ధి చెందేందుకు, నైపుణ్యానికి దారితీస్తుందని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈవో రమేష్‌ నాయర్‌ పేర్కొన్నారు. రీట్‌ గురించి అవగాహన పెరిగినకొద్దీ రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి దీనికి క్రమంగా ఆదరణ కూడా పెరుగుతుందన్నారు. రిటైల్‌, వేర్‌హౌసింగ్‌, హాస్పిటాలిటీ ఆస్తులు సైతం భవిష్యత్తులో రీట్‌ కిందకు వస్తాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దేశంలో వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 294 మిలియన్‌ చదరపు అడుగుల రీట్‌కు అర్హమైన కార్యాలయ స్థలాలను కలిగి ఉన్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. అత్యధికంగా బెంగళూరు నగరంలో 97.8 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ స్థలాలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే ముంబైలో 49.7 మిలియన్‌ చదరపు అడుగులు (రీట్‌కు అర్హమైన కార్యాలయ స్థలాల్లో 17 శాతం) ఉన్నట్టు తెలిపింది.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Thursday 25th April 2019

ప్రధాన ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో వున్నప్పటికీ,క్రితం రోజు భారీగా పెరిగిన భారత్‌ మార్కెట్‌ గురువారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40  గంటలకు 4 పాయింట్ల లాభంతో11,730 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్‌ ఫ్యూచర్‌ 11,726 పాయింట్ల వద్ద ముగిసింది.  బుధవారం రాత్రి అమెరికా సూచీలు నష్టాలతో ముగిసాయి. తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌,  తైవాన్‌ సూచీలు మినహా మిగిలినవి కొద్దిపాటి నష్టాలతో ట్రేడవుతున్నాయి.

గురువారం వార్త‌ల్లోని షేర్లు

Thursday 25th April 2019

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా గురువారం ప్రభావిత‌మయ్యే షేర్ల వివ‌రాలు ఇండియాబుల్స్  హౌసింగ్ ఫైనాన్స్:- మార్చి త్రైమాసికంలో నిక‌రలాభం మార్చి త్రైమాసికంలో 2 శాతం తగ్గింది. రూ.1,006 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.3,658 కోట్ల నుంచి రూ.4,091 కోట్లకు పెరిగింది. 2017–18లో మొత్తం ఆదాయం రూ.14,959 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.17,027 కోట్లకు వృద్ధి చెందాయి. ఎస్‌బీఐ:-  ప్రస్తుత ఆర్థిక

Most from this category