STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీ క్యూ3 ఫలితాల వివరాలు

Friday 8th February 2019
Markets_main1549606726.png-24087

అరబిందో మధ్యంతర డివిడెండు 125 శాతం

ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండవ మధ్యంతర డివిడెండు 125 శాతం చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు సమ్మతి తెలిపింది. డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో అరబిందో ఫార్మా మెప్పించింది. ఈ కాలంలో నికరలాభం రూ.712 కోట్లు సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 19.66 శాతం అధికం. టర్నోవరు రూ.4,336 కోట్ల నుంచి రూ.5,269 కోట్లకు ఎగసింది. ఎబిటా 20.6 శాతంగా ఉంది. యూఎస్‌ ఫార్ములేషన్స్‌ అమ్మకాలు తోడవడంతో మంచి వృద్ధిని సాధించింది. ఈ విభాగం 27.4 శాతం వృద్ధితో రూ.2,433 కోట్లు నమోదైంది. యూరప్‌ ఫార్ములేషన్స్‌ ఆదాయం 10.3 శాతం అధికమై రూ.1,293 కోట్లు, గ్రోత్‌ మార్కెట్లు 36 శాతం వృద్ధితో రూ.340 కోట్లు, ఏఆర్‌వీ సేల్స్‌ 17.8 శాతం అధికమై రూ.281 కోట్లుగా ఉంది. ఏపీఐ అమ్మకాల ఆదాయం 20.4 శాతం పెరిగి రూ.922 కోట్లు సాధించింది. ఆర్‌అండ్‌డీ వ్యయం మొత్తం ఆదాయంలో 4.8 శాతం ఉందని కంపెనీ ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.14,271 కోట్ల టర్నోవరుపై రూ.1,779 కోట్ల నికరలాభం పొందింది.

నవభారత్‌ లాభం రూ.33.4 కోట్లు
డిసెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో నవభారత్‌ వెంచర్స్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.31.6 కోట్ల నుంచి రూ.33.4 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.321 కోట్ల నుంచి రూ.364 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-డిసెంబరులో రూ.1,079 కోట్ల టర్నోవరుపై రూ.129 కోట్ల నికరలాభం పొందింది.
77 శాతం పెరిగిన పిట్టి లాభం..
డిసెంబరు త్రైమాసికంలో పిట్టి ఇంజనీరింగ్‌ నికరలాభం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 77 శాతం అధికమై రూ.5.2 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.77 కోట్ల నుంచి రూ.165 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-డిసెంబరులో రూ.472 కోట్ల టర్నోవరుపై రూ.17.4 కోట్ల నికరలాభం సాధించింది.

ఎమ్‌ఆర్‌ఎఫ్‌ లాభం 18 శాతం డౌన్‌

  • ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: టైర్ల కంపెనీ ఎమ్‌ఆర్‌ఎఫ్‌కు  ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.279 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.341కోట్ల నికర లాభం ఆర్జించామని కంపెనీ తెలిపింది. వ్యయాలు పెరగడంతో నికర లాభం 18 శాతం క్షీణించిందని వివరించింది. గత క్యూ3లో రూ.3,799 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.4,034 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.3,331 కోట్ల నుంచి రూ.3,750 కోట్లకు ఎగిశాయని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది.

ఆర్సెలర్‌ మిట్టల్‌ లాభం 16 శాతం అప్‌

లండన్‌: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం, ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీ నికర లాభం డిసెంబర్‌ 31, 2018తో ముగిసిన క్వార్టర్‌లో 16 శాతం వృద్ధితో  119 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌లో 103 కోట్ల డాలర్ల నికర లాభం వచ్చిందని ఆర్సెలర్‌ మిట్టల్‌ తెలిపింది. అమ్మకాలు అధికంగా ఉండటం, ఇతర కారణాల వల్ల నికర లాభం పెరిగిందని పేర్కొంది. 2017, క్యూ4లో 1,771 కోట్ల డాలర్లుగా ఉన్న మొత్తం అమ్మకాలు గతేడాది నాలుగో క్వార్టర్‌లో 1,832 కోట్ల డాలర్లకు పెరిగాయని తెలిపింది. ఈ కంపెనీ జనవరి-డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2017లో 460 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం గత ఏడాదిలో 13 శాతం ఎగసి 510 కోట్ల డాలర్లకు చేరిందని తెలిపింది. ఇక గతేడాది డిసెంబర్‌ 31 నాటికి స్థూల రుణ భారం 1,260 కోట్ల డాలర్లుగా ఉందని పేర్కొంది.



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Friday 8th February 2019

6శాతం క్షీణించి యూనియన్‌ బ్యాంక్‌ షేరు దాదాపు ఏడాదిన్నర తరువాత ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్ప కాలిక నిధులపై వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడికి లోనుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకింగ్‌ దాదాపు 2శాతం నష్టపోయింది. యూనియన్‌ బ్యాంక్‌ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌

14 రెట్లు పెరిగిన సెయిల్‌ లాభం

Friday 8th February 2019

రూ.616 కోట్లకు నికర లాభం రూ.15,910 కోట్లకు మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ, సెయిల్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.616 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.43 కోట్ల నికర లాభం వచ్చిందని, దాదాపు 14 రెట్లు వృద్ధి సాధించామని సెయిల్‌ తెలిపింది. ఆదాయం అధికంగా రావడం, నిల్వల స్థాయి తక్కువగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం

Most from this category