STOCKS

News


రుణ రేట్లను స్వల్పంగా తగ్గించిన ఓబీసీ

Wednesday 12th June 2019
news_main1560317579.png-26241

న్యూఢిల్లీ: ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) మంగళవారం తన ఏడాది రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్- నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు)ను స్వల్పంగా ఐదు బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 8.70 శాతానికి తగ్గింది. జూన్‌ 11 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని పేర్కొంది. కస్టమర్ల గృహ, ఆటో, వ్యక్తిగత రుణ రేటు సాధారణంగా ఏడాది రేటుకు అనుసంధానమై ఉంటుంది. మరో రెండు కాలపరిమితుల రేట్లను కూడా బ్యాంక్‌ 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది ఆరు నెలల కాలపరమితి రేటును 8.70 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గించింది. నెల రేటు కూడా 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 8.35 శాతానికి దిగివచ్చింది. గత వారంలో ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను పావుశాతం (ప్రస్తుతం 5.75 శాతం) తగ్గించిన నేపథ్యంలో ఓబీసీ తాజా నిర్ణయం తీసుకుంది. 

బీఓఎం కూడా...
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) కూడా ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 8.60 శాతానికి తగ్గింది. 



You may be interested

ఇండిగో ‘వేసవి ప్రత్యేక ఆఫర్‌’

Wednesday 12th June 2019

రూ.999కే టికెట్‌ న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. ‘స్పెషల్‌ సమ్మర్‌ సేల్‌’ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.999కే టికెట్‌ అందిస్తోంది. జూన్‌ 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుండగా.. జూన్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు జరిగే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాల ప్రారంభ టికెట్‌ ధర రూ.3,499గా ఉండనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ

గూగుల్‌ను వెనక్కి నెట్టిన అమెజాన్‌

Wednesday 12th June 2019

అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరణ అత్యుత్తమ కస్టమర్‌ సేవలు, భిన్న ఉత్పత్తులు ప్లస్‌ కాంటార్‌ 100 టాప్‌ బ్రాండ్స్‌ నివేదిక వెల్లడి లండన్‌: అమెరికాకు చెందిన అగ్రగామి రిటైల్‌ సంస్థ అమెజాన్‌... టెక్‌ దిగ్గజాలైన యాపిల్‌, గూగుల్‌లను వెనక్కి నెట్టేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించింది. అమెజాన్‌ బ్రాండ్‌ విలువ గతేడాది 52 శాతం (108 బిలియన్‌ డాలర్ల మేర) పెరిగి 315 బిలియన్‌ డాలర్లకు (రూ.22.05 లక్షల కోట్లకు) చేరినట్టు అంతర్జాతీయ

Most from this category