STOCKS

News


భారీ ఆస్తిపరులు 70 శాతం అప్‌!

Wednesday 12th September 2018
news_main1536731167.png-20197

ముంబై: దేశంలో భారీ నికర ఆస్తులున్న వ్యక్తుల (డెమీ-బిలియనీర్లు) సంఖ్య గణనీయంగా పెరగనుందని ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌... తన తాజా నివేదికలో పేర్కొంది. నైట్‌ఫ్రాంక్‌ ఇండియా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం 500 మిలియన్‌ డాలర్లు, ఆపైన నికర ఆస్తులున్న వారి సంఖ్య 2017లో 200. 2022 నాటికి ఈ సంఖ్య 340కి పెరుగుతుంది. నివేదికలో మరిన్ని వివరాలను చూస్తే...

  •  ముంబై, ఢిల్లీ వంటి భారత్‌ ప్రధాన నగరాల్లో ప్రధాన రెసిడెన్షియల్‌ మార్కెట్లు గడచిన ఐదు సంవత్సరాలుగా దాదాపు స్థిరంగా ఉన్నాయి. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం. 
  •  మార్కెట్‌లో డిమాండ్‌ భారీగా ఉంది. రియల్టీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.  ‘డెబీ-బిలియనీర్ల’ సంఖ్య పెరుగుతుందన్న సర్వే ఈ అంశాలను బలపరుస్తోంది. 
  •  గడచిన ఐదేళ్లలో ఆసియాలో డెమీ బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొట్టమొదటిసారి ఈ విషయంలో నార్త్‌ అమెరికాను ఆసియా వెనక్కు తగ్గింది. 
  •  వెల్త్‌ డేటా స్పెషలిస్ట్స్‌ వెల్త్‌-ఎక్స్‌ అంచనాప్రకారం- 2020 నాటికి 500 మిలియన్‌ డాలర్లకుపైగా ఆస్తులున్న ఆసియన్ల సంఖ్య దాదాపు 3000కు చేరుతుంది. 
  •  ప్రపంచవ్యాప్తంగా పటిష్ట ఆర్థిక వృద్ధి ధోరణి ఉంది. ఆస్తుల విలువలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డెమీ-బిలియనీర్ల సంఖ్య పెరుగుదలలో ఆయా అంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. 2017లో ప్రపంచ వ్యాప్తంగా డెమీ-బిలియనీర్ల సంఖ్య 6,900. 2022 నాటికి ఈ సంఖ్య  9,570కు పెరుగుతుందని అంచనా. 



You may be interested

కోలుకున్న ఎఫ్‌ఎంసీజీ షేర్లు

Wednesday 12th September 2018

రెండు వరుస ట్రేడింగ్‌ల్లో తీవ్ర నష్టాలపాలైన ఎఫ్‌ఎంసీజీ షేర్లు బుధవారం కోలుకుంటున్నాయి. ఉదయం సెషన్లో ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.23 శాతం వరకూ ర్యాలీ చేసింది. ఉదయం గం.11:30ని.లకు సూచి గత ముగింపు(30,067.55)తో పోలిస్తే 562 పాయింట్ల లాభపడి 30,629.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచిలో అత్యధికంగా డాబర్‌ ఇండియా, ఐటీసీ షేర్లు

రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం రూ.272 కోట్లు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.272 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ. 378 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.4,444 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,641 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ1లో షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) రూ.11.70గా

Most from this category