STOCKS

News


ఆరు నెలల్లో ఎన్‌పీఏలు రూ.23,000 కోట్లు తగ్గాయి

Saturday 29th December 2018
news_main1546057195.png-23306

ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) రూ.23,860 కోట్లు తగ్గాయని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. 2018 మార్చి నాటికి రూ.9.62 లక్షల కోట్లకు చేరగా ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రికార్డు స్థాయింలో రూ.60,726 కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాయని తెలిపారు. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న వసూళ్లతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉన్నాయన్నారు. 2015లో ఆస్తుల నాణ్యత సమీక్ష, పునరుద్ధరించిన రుణాలను ఎన్‌పీఏలుగా గుర్తించడం, వసూలు కాని రుణాలను పునర్‌వ్యవస్థీకరిచేందుకు నిరాకరించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టినట్టు వివరించారు.



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత ఊరట

Saturday 29th December 2018

-సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ పొడిగింపు  మరో మూడు నెలలు వరకూ ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) ఊరటనిచ్చే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది. సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ ఫెసిలిటీని మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో లిక్విడిటీ సమస్యలతో సతమతమవుతున్న ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత వెసులుబాటు చిక్కుతుంది. బ్యాంక్‌లు ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ ఫెసిలిటీని ఈ ఏడాది అక్టోబర్‌లో  ఆర్‌బీఐ 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీనిని

ఉక్కు సుంకంపై అమెరికాతో చర్చలు

Saturday 29th December 2018

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని.. అక్కడి అధికారును భారత ప్రభుత్వం కోరింది. ఉక్కు ఎగుమతి సంస్థల ప్రయోజనాల దృష్యా అమెరికా ప్రభుత్వ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. సెయిల్‌ నిర్వహించిన ఒక సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించిన ఆయన.. ‘ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గించాలని అమెరికా అధికారులను అడిగాం. భారత స్టీల్‌ పరిశ్రమ చాలా

Most from this category