9న నొవోటెల్ విజయవాడ ప్రారంభం
By Sakshi

పటమట(విజయవాడ తూర్పు): విజయవాడలో వరుణ్ గ్రూపు రూ.150 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న నొవోటెల్- వరుణ్ హోటల్‌ను ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు వరుణ్ గ్రూపు అధినేత వి.ప్రభు కిషోర్ చెప్పారు. 2009లో తాము ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టామని, అప్పటి నుంచి ఎప్పటికప్పుడు మరిన్ని గదులను జత చేసుకుంటూ ముందుకెళుతున్నామని చెప్పారు. శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘విజయవాడ హోటల్లో 227 విలాసవంతమైన గదులతోపాటు నాలుగు ఫుడ్‌బేవరేజ్ అవుట్లెట్లు, ఏడు సమావేశ గదులు, 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాంక్వెట్ హాలు ఉంటాయి. అకార్డ్ గ్రూపునకు చెందిన నొవోటెల్ బ్రాండుకు 20వ హోటల్‌గా ఇది ప్రారంభమవుతుంది. నొవోటెల్ సిగ్నేచర్ స్పా, రూఫ్‌టాప్ స్విమ్మింగ్ ఫూల్, ఫిట్నెస్ కోసం ఇన్–బ్యాలెన్స్ జిమ్‌తో పాటు దేశంలోని ఏ హోటల్లో లేనివిధంగా 200 మీటర్ల యూనీఫ్లో జాగింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అమరావతిలోని ఉద్ధండరాయుని పాలెంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.40 కోట్లు వెచ్చించి కన్వెన్షన్ సెంటర్‌ను 2019 మార్చి నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారాయన. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్ బెల్లంకొండ మధు, హోటల్ మేనేజర్ టి.వి. మధుపాల్ పాల్గొన్నారు.
You may be interested
ఎస్బీఐ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం
Saturday 8th December 2018న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.20,000 కోట్ల నిధుల సమీకరణకు ఆ బ్యాంక్ వాటాదారుల ఆమోదం లభించింది. షేర్ల విక్రయం ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించనున్నామని, ఈ నిధుల సమీకరణకు తమ వాటాదారులు ఆమోదం తెలిపారని ఎస్బీఐ వెల్లడించింది. ముంబైలో జరిగిన వాటాదారుల సాధారణ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ నిధుల సమీకరణకు ఆమోదం లభించిందని పేర్కొంది. ఫాలో ఆన్ ఆఫర్ లేదా క్యూఐపీ/జీడీఆర్/ఏడీఆర్ లేదా మరే
మల్టీబ్యాగర్ రిటర్నుల కోసం ఏం చేయాలి?
Friday 7th December 2018మార్కెట్లలో తాము పెట్టిన పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందాలని, మల్టీబ్యాగర్ రిటర్నులు రాబట్టాలని దాదాపు అందరు ఈక్విటీ ఇన్వెస్టర్ల ఆలోచనల్లో ఉంటుంది. రాకేశ్ జున్‌జున్‌వాలా వంటి ఏ కొద్ది మందికో తెలిసిన విద్యగా దీన్ని భావించక్కర్లేదు. కొన్ని సూత్రాలను ఆచరణలో పెడితే మల్టీబ్యాగర్ రిటర్నులు మీ సొంతం అవుతాయి. ఇందుకు ఏం చేయాలన్నది, అలాగే, ఓ స్టాక్‌ను ఎప్పుడు విక్రయించాలన్నది వ్యాల్యూ ఇన్వెస్టర్ సుమీత్ నాగర్ తెలియజేశారు. రాబడుల కోసం అధిక