STOCKS

News


నవంబర్‌లోనూ అటో అమ్మకాలు నిదానమే

Monday 3rd December 2018
news_main1543813309.png-22583

  • మారుతి, ఎంఅండ్‌ఎం, హోండా కార్ల అమ్మకాల్లో వృద్ధి
  • టాటా, హ్యుందాయ్‌, టయోటా విక్రయాలు తగ్గుదల

న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌ నవంబర్‌లోనూ ఆటోమొబైల్‌ కంపెనీలకు ఆనందాన్నివ్వలేదు. స్థూల ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా లేకపోవడంతో పండుగల విక్రయాలు జోరుగా సాగలేదు. ప్రధాన కంపెనీలైన మారుతి సుజుకి, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), హోండా కార్స్‌ ఇండియా కార్ల అమ్మకాలు పెరగ్గా, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌, టయోటా విక్రయాలు తగ్గాయి.
- మారుతి సుజుకి దేశీయ కార్ల అమ్మకాలు 1,46,018 యూనిట్లు. క్రితం ఏడాది ఇదే మాసంలో అమ్మకాలు 1,45,300. ఆల్టో, వ్యాగన్‌ఆర్‌ 29,954 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇవి 21.6 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ అమ్మకాలు 10 శాతం పెరిగి 72,533 యూనిట్లుగా ఉన్నాయి.
- హ్యుందాయ్‌ మోటార్‌ అమ్మకాలు 43,709 యూనిట్లు. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన కార్లు రూ.44,008 యూనిట్లు.
- టయోటా అమ్మకాలు 15.8 శాతం తగ్గి 10,721 యూనిట్లుగా ఉన్నాయి.
- టాటా మోటార్స్‌ దేశీయ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 1 శాతం తగ్గి 16,982 యూనిట్లుగా నమోదయ్యాయి.
- ఫోర్డ్‌ ఇండియా 6,375 కార్లను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 7,777 యూనిట్లుగా ఉండడం గమనార్హం.
- ఎంఅండ్‌ఎం అమ్మకాలు 15 శాతం వృద్ధి తో 41,564 వాహనాలుగా ఉన్నాయి.
- హోండాకార్స్‌ ఇండియా 10 శాతం అధికంగా 13,006 కార్లను విక్రయించింది.



You may be interested

హెచ్‌1బీ వీసా కొత్త ప్రతిపాదనలతో అనిశ్చితి: నాస్కామ్‌

Monday 3rd December 2018

న్యూఢిల్లీ: హెచ్‌1బీ వీసాల కోసం కంపెనీలు ముందుగానే ఎలక్ట్రానిక్‌ రూపంలో నమోదు చేసుకోవాలనే అమెరికా నూతన ప్రతిపాదనతో అనిశ్చితి పెరుగుతుందని, అక్కడి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సమాఖ్య ‘నాస్కామ్‌’ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌1బీ వీసాలకు సంబంధించిన 139 పేజీల ప్రతిపాదనను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ప్రభావం అమెరికా కంపెనీలు, ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని తమ అభిప్రాయాల రూపంలో తెలియజేస్తామని ప్రకటించింది. ట్రంప్‌ సర్కారు

ఎక్కడి రేట్లు అక్కడే..!

Monday 3rd December 2018

- యథాతథ స్థితిని కొసాగించవచ్చు... - నిపుణుల అంచనా... - 5న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్షలో యథాతథస్థితిని కొనసాగించే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం శాంతించినప్పటికీ... ఈ నెల 5న ప్రకటించనున్న పాలసీ నిర్ణయంలో కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. వరుసగా రెండు పాలసీల్లో రెపో రేటును

Most from this category