STOCKS

News


నోకియా 5.1 ప్లస్‌ మరిన్ని వేరియంట్లలో

Saturday 9th February 2019
news_main1549697972.png-24106

హైదరాబాద్‌: హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా 5.1 ప్లస్‌ మోడల్‌లో అధిక ర్యామ్‌, స్టోరేజీతో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఇప్పటి వరకు 3జీబీ ర్యామ్‌, 32 జీబీ రామ్‌ మోడల్‌ మాత్రమే ఉండేది. ఇప్పుడు 4జీబీ/64జీబీ, 6జీబీ/64జీబీ వేరియంట్లను కూడా తీసుకొచ్చింది. ‘‘నోకియా 5.1 ప్లస్‌ను యూజర్లు ఎంతో అభిమానిస్తున్నారు. దీనికి అనుకూలంగా వారు ఎన్నో వేదికల్లో రేటింగ్‌ కూడా ఇస్తున్నారు. కనుక అధిక సామర్థ్యంతో కూడిన రకాలను తీసుకొచ్చినట్టు’’ హెచ్‌ఎండీ గ్లోబల్‌ దేశీయ అధిపతి అజేయ్‌ మెహతా తెలిపారు. నోకియా 5.1 ప్లస్‌లో మీడియాటెక్‌ హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. ఆండ్రాయిడ్‌ వన్‌ తో మంచి పనితీరుతో ఉంటుందన్నారు. 6జీ/64జీబీ మోడల్‌ ధర రూ.16,499 కాగా, 4జీబీ/64జీబీ వెర్షన్‌ ధర 14,499.



You may be interested

ప్రయాణికుల వాహన విక్రయాల్లో క్షీణత

Saturday 9th February 2019

జనవరిలో 2,80,125 వాహన అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం తక్కువ న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగంలో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి నెలలోనూ ప్రయాణికుల వాహనాల్లో 2 శాతం క్షీణత నమోదైంది. మొత్తం 2,80,125 వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం సియామ్‌ తెలిపింది. పండుగ సీజన్‌లో అమ్మకాలు ఆశించినంత లేకపోవడంతో నిల్వలను తగ్గించుకోవడంపై తయారీదారులు దృష్టి పెట్టినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జనవరిలో అమ్ముడైన వాహనాలు

అదానీ ట్రాన్స్‌మిషన్స్‌ చేతికి కేఈసీ బికనీర్‌

Saturday 9th February 2019

ముంబై: కేఈసీ ఇంటర్నేషనల్‌లో భాగమైన విద్యుత్ పంపిణీ సంస్థ కేఈసీ బికనీర్ సికర్ ట్రాన్స్‌మిషన్‌ను (కేబీఎస్‌టీ) కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆదానీ ట్రాన్స్‌మిషన్ (ఏటీఎల్‌) వెల్లడించింది. 100 శాతం వాటాల కొనుగోలుకు రూ. 227.50 కోట్లు వెచ్చించినట్లు వివరించింది. గతేడాది నవంబర్‌లో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏటీఎల్‌ పేర్కొంది. కేబీఎస్‌టీకి 344 సర్క్యూట్ కి.మీ. మేర లైన్లు ఉన్నాయని, ఈ కొనుగోలుతో తమ నెట్‌వర్క్ మొత్తం 13,450

Most from this category