STOCKS

News


యాంబీ వ్యాలీని కొనేవారు లేరు

Thursday 12th July 2018
news_main1531404380.png-18254

న్యూఢిల్లీ: సహారా యాంబీవ్యాలీ వేలం ప్రక్రియను నిలిపివేశామని, వేలం నోటీసుకు ఎటువంటి స్పందన లభించకపోవడమే దీనికి కారణమని బోంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే, ఇన్వెస్టర్ల డబ్బులు చెల్లించేందుకు గాను ఈ ఆస్తుల వేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని లిక్విడేటర్‌ను చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా,, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, ఏకే సిక్రిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇక, ముంబైలోని వాసాయ్‌ వద్దనున్న తమ ఆస్తులను కొనుగోలు చేసేందుకు సాయి రిదమ్‌ రియల్టర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ప్రైమ్‌ డౌన్‌ టౌన్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని సహారా గ్రూపు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీటి అమ్మకంతో రూ.1,000 కోట్లు లభిస్తాయని చెప్పారు. దీంతో సెబీ-సహారా ఖాతాలో రూ.1,000 కోట్లను డిపాజిట్‌ చేయాలని ఆ సంస్థలను కోర్టు ఆదేశించింది. వెంటనే రూ.99 కోట్లను డిపాజిట్‌ చేసి, మిగిలిన మొత్తాన్ని సెప్టెంబర్‌ 12లోపు రెండు విడతలుగా డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన రూ.24,000 కోట్లను తిరిగి చెల్లించాలన్న ఆదేశాలను సహారా గ్రూపు నెరవేర్చడంలో విఫలమవడంతో దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 



You may be interested

బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ గ్రాన్‌ టురిస్మోలో కొత్త వేరియంట్‌

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ‘3 సిరీస్‌ గ్రాన్‌ టురిస్మో’లో కొత్త వేరియంట్‌ ‘320డి గ్రాన్‌ టురిస్మో స్పోర్ట్‌’ కారును భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.46.6 లక్షలు. బీఎండబ్ల్యూ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. 320డి గ్రాన్‌ టురిస్మో స్పోర్ట్‌లో 2 లీటర్‌ 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో

కర్ణాటక బ్యాంక్‌ లాభం రూ.163 కోట్లు

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.134 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.163 కోట్లకు చేరుకున్నట్లు కర్ణాటక బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ ఎమ్‌.ఎస్‌.మహాబలేశ్వర చెప్పారు. రుణ నాణ్యత మెరుగుపడటం, నికర వడ్డీ

Most from this category