STOCKS

News


పవన్‌హన్స్‌లో ఆగిన వాటాల విక్రయం

Tuesday 23rd April 2019
news_main1555997656.png-25290

ఎన్నికల తర్వాతే తదుపరి ప్రక్రియ న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌హన్స్‌లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఒకే ఒక్క ఇన్వె‍స్టర్‌ నుంచి బిడ్‌ వచ్చినట్టు ఓ సీనియర్‌ అధికారి తెలియజేశారు. ఎన్నికల వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పవన్‌హన్స్‌లో కేంద్రానికి 51 శాతం వాటా, ఓఎన్‌జీసీకి 49 శాతం వాటా ఉన్నాయి. ఆసక్తి కలిగిన ఇ‍న్వెస్టర్లు ఫైనాన్షియల్‌ బిడ్లను దాఖలు చేసేందుకు మార్చి 6వరకు సమయం ఇచ్చారు. ప్రభుత్వం, ఓఎన్‌జీసీ కలసి నూరు శాతం వాటాను విక్రయించే యోచనతో ఉన్నాయి. ‘‘ఒకే ఒక్క ఇన్వెస్టర్‌ నుంచి ఫైనాన్షియల్‌ బిడ్‌ వచ్చిందని ఈ లావాదేవీ వ్యవహారాలు చూసే (ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌) సంస్థ మాకు సమాచారమిచ్చింది. ఈ బిడ్‌ విషయంలో ముందుకు వెళ్లాలా? లేక తిరిగి ఈ ప్రక్రియను మొదట నుంచి ఆరంభించాలా? అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలయ్యే వరకు వేచి చూసి, ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది’’ అని ఆ అధికారి వెల్లడించారు. మే 23న ఫలితాల వెల్లడితో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనున్న విషయం తెలిసిందే. 



You may be interested

జెట్‌ ఎయిర్‌ షేర్లు 11శాతం జంప్‌

Tuesday 23rd April 2019

మూడురోజుల వరుసగా నష్టాల్లో ముగిసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.158.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణదాతలు కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న ల్యాండింగ్‌ స్లాట్‌ను, ఓవర్సీస్‌ ప్లైయింగ్‌ రైటర్స్‌ పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. . బ్యాంకులకు రూ.8,500 కోట్లు, విమానాల లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు జెట్‌ రూ.4,000 కోట్ల

బ్లాక్‌స్టోన్ చేతికి ఎస్సెల్ ప్రోప్యాక్‌

Tuesday 23rd April 2019

- డీల్ విలువ రూ.3,211 కోట్లు - ముందు ప్రమోటర్ల నుంచి 51% వాటా కొనుగోలు - తర్వాత 26 శాతానికి ఓపెన్ ఆఫర్‌ ముంబై: అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ ఎస్సెల్ ప్రోప్యాక్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.3,211 కోట్లు (462 మిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా కంపెనీల్లో ఉపయోగించే లామినేటెడ్ ట్యూబ్స్‌ను ఎస్సెల్ ప్రోప్యాక్ తయారుచేస్తోంది. ఈ డీల్

Most from this category