News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ నుంచి ‘నిధుల’ ప్రతిపాదన లేదు: ఎస్‌బీఐ

Thursday 27th September 2018
news_main1538023480.png-20620

ముంబై: సంక్షోభంలో ఉన్న ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నుంచి అదనపు నిధులు కావాలంటూ ఎటువంటి నిర్మాణాత్మక ప్రతిపాదన తమకు రాలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో ఎస్‌బీఐకి 6.42 శాతం వాటా ఉంది. పలు డెట్‌ చెల్లింపుల్లో ఇటీవల ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు విఫలమైన విషయం తెలిసిందే. ఈ గ్రూపునకు మొత్తం రూ.91,000 కోట్ల రుణ భారం ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నుంచి నిర్మాణాత్మక ప్రతిపాదన తమ ముందుకు వచ్చినప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను దివాలా తీయనీయబోమని ఈ గ్రూపులో 25 శాతం వాటా కలిగిన ఎల్‌ఐసీ ప్రకటించిన విషయం గమనార్హం. అపోలో హాస్పిటల్స్‌తో కలసి ఎస్‌బీఐ కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించిన అనంతరం రజనీష్‌ ఈ అంశంపై విలేకరుల ప్రశ్నలకు స్పందించారు. ఫైనాన్షియల్‌ మార్కెట్ల స్థిరీకరణకు ఓ లెండర్‌గా తాము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. పరిశ్రమ విశాల ప్రయోజనాలు, వాటాదారుల ప్రయోజనాల కోణంలో తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. బ్యాంకింగ్‌ పరిశ్రమలో ప్రస్తుత లిక్విడిటీ (నిధుల లభ్యత) సంక్షోభం అంతగా ఆందోళన చెందేంత లేదని రజనీష్‌ స్పష్టం చేశారు. నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని ఆర్‌బీఐని కోరేంత పెద్దదిగా లిక్విడిటీ సమస్య ఉందని తాను భావించడం లేదన్నారు. 



You may be interested

అదనపు మూలధనంపై పీఎన్‌బీ కసరత్తు

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అదనంగా మరింత మూలధనం సమకూర్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా కేంద్రం నుంచి రూ. 5,431 కోట్లు సమకూర్చుకునే ప్రతిపాదనను పరిశీలించేందుకు గురువారం బ్యాంక్ బోర్డు సమావేశం కానుంది. ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి తీసుకునే క్రమంలో అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) నిర్వహించే తేదీలను కూడా ఇందులో ఖరారు చేయనుంది. స్టాక్ ఎక్స్చేంజీలకు

టాటా టెలి ‘స్మార్ట్‌ ఆఫీస్‌’

Thursday 27th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీ టాటా టెలి బిజినెస్‌ సర్వీసెస్‌ చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఈ) కంపెనీల కోసం స్మార్ట్‌ ఆఫీస్‌ పేరుతో సేవలను ప్రారంభించింది. వాయిస్‌, డేటా, స్టోరేజ్‌తోపాటు అప్లికేషన్స్‌ వంటి ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంబంధ సేవలన్నీ ఒకే గొడుగు కింద లభించడం దీని ప్రత్యేకత. నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలనుకునే ఎస్‌ఎంఈలకు స్మార్ట్‌ ఆఫీస్‌ చక్కని పరిష్కారమని కంపెనీ చెబుతోంది. అందుబాటు ధరలోనే చార్జీలు ఉంటాయని సంస్థ

Most from this category