STOCKS

News


టాటా గ్రూపుపై హద్దుల్లేని నియంత్రణ కోసం ప్రయత్నం

Friday 13th July 2018
news_main1531502350.png-18290

ముంబై: టాటా గ్రూపు చైర్మన్‌, బోర్డు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సైరస్‌ మిస్త్రీ ‘గ్రూపుపై హద్దుల్లేని నియంత్రణ’ పొందేందుకు ప్రయత్నం చేశారని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. ​టాటాసన్స్‌, రతన్‌ టాటాలకు వ్యతిరేకంగా టాటా గ్రూపు మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ చేసిన ఆరోపణల్లో ఎటువంటి యోగ్యత లేదని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై ప్రత్యేక బెంచ్‌ ఇటీవలే విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన కేసులో మరిన్ని వివరాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఎన్‌సీఎల్‌టీ 368 పేజీలతో కూడిన తీర్పును ప్రకటించింది. కేసు విచారణలో భాగంగా బెంచ్‌ టాటాల కుటుంబ చరిత్ర లోతుల్లోకి వెళ్లి పరిశీలించింది. వ్యాపార విధానాలు, విలువలు, దశాబ్దాలుగా టాటాలు సమాజానికి చేసిన సేవలను కూడా పరిశీలించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌... టాటా గ్రూపు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పక్షపాతంతో కూడిన వ్యాపార నిర్ణయాలు తీసుకుని ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. స్వీయ ప్రగతి కోసం టాటాలు వ్యక్తిగతంగా లాభపడేందుకు ఏదైనా చేస్తారా? అన్నది తేల్చేందుకు, టాటాల విలువలు, కుటుంబ ప్రతిష్టను తెలుసుకునేలా తమను నడిపించినట్టు బెంచ్‌ స్పష్టం చేసింది. రతన్‌ టాటా, సూనవాలా గ్రూపు కంపెనీల వ్యవహారాల్లో తరచూ జోక్యం చేసుకుంటూ షాడో డైరెక్టర్లుగా వ్యవహరించేవారని మిస్త్రీ చేసిన ఆరోపణలను కూడా బెంచ్‌ తోసిపుచ్చింది. రతన్‌ టాటా, సూనవాలా కంపెనీల ప్రయోజనాల పట్ల గానీ లేదా పిటిషనర్‌ పట్ల (మిస్త్రీ) గానీ వివక్ష చూపారని నిరూపించడంలో విఫలమైనట్టు స్పష్టం చేసింది. రతన్‌ టాటా, సూనవాలా, మిస్త్రీల మధ్య జరిగిన ఈ మెయిల్స్‌ సంప్రదింపులను కూడా బెంచ్‌ పరిశీలించింది. ‘‘చాలా అంశాల్లో సూచనలు కోరుతూ మిస్త్రీ నుంచి లేఖలు వచ్చినప్పుడు, కంపెనీలకు సంబంధించి వ్యాపార ఆలోచనలను టాటా సూచించడం తప్పా? కంపెనీ వ్యాపారం గురించి మెజారిటీ వాటాదారుగా ఉన్న టాటా ట్రస్ట్‌ ఏమీ చెప్పకూడదన్నది మిస్త్రీ ఆలోచనా?’’ అని బెంచ్‌ ప్రశ్నించింది.You may be interested

డీడీపై కొనుగోలుదారు పేరు

Friday 13th July 2018

న్యూఢిల్లీ: డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ)లపై కొనుగోలు చేస్తున్న వారి పేరు కూడా ఉండాలని అన్ని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. సెప్టెంబర్‌ 15 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. దీంతో పే ఆర్డర్‌, బ్యాంకర్స్‌ చెక్‌, డీడీలపై కొనుగోలు చేసే వారి పేరు కూడా ఇకపై కనిపించనుంది. కేవైసీ నిబంధనల్లో ఆర్‌బీఐ ఈ మేరకు అవసరమైన మార్పులు కూడా చేసింది. డీడీలను మనీ లాండరింగ్‌కు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న

వచ్చే ఏడాది ఐదో స్థానానికి చేరుకుంటాం

Friday 13th July 2018

న్యూఢిల్లీ: అనుకున్న విధంగా ఆర్థిక వృద్ధి విస్తరణ కొనసాగితే వచ్చే ఏడాది భారత్‌ బ్రిటన్‌ అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, వాణిజ్య ఘర్షణల రూపంలో సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. నాలుగేళ్ల నుంచి వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిన భారత్‌, ఆర్థిక విస్తరణ

Most from this category