STOCKS

News


లిక్విడిటీ సమస్య వ్యవస్థాపరం కాదు

Friday 16th November 2018
news_main1542347853.png-22080

న్యూఢిల్లీ: లిక్విడిటీ కొరత వ్యవస్థాపరమైన సమస్య కాదని ప్రముఖ బ్యాంకర్లు స్పష్టంచేశారు. రోలోవర్‌కు సంబంధించి అన్ని ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలూ చెల్లింపులను చేయగలవని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ చెప్పారు. సేవింగ్స్‌ అండ్‌ రిటైల్‌ బ్యాంక్స్‌ ప్రపంచ 25వ కాంగ్రెస్‌ సదస్సుకు హాజరైన సందర్భంగా పలువురు బ్యాంకింగ్‌ రంగ నిపుణులు లిక్విడిటీపై స్పందించారు. నాబార్డ్‌ చైర్మన్‌ హెచ్‌కే భన్వాలా మాట్లాడుతూ... లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. ‘‘కొన్ని సంస్థలు బ్యాంకుల నుంచి స్వల్పకాల రుణాలను తీసుకుని వాటిని కస్టమర్లకు దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వటం వల్ల వాటికి సంబంధించి పెద్ద సమస్య ఏదీ లేదు. అదో సమస్యే కానీ, వ్యవస్థాగత సమస్య కాదు’’ అని పేర్కొన్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో లిక్విడిటీపై ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నో బ్యాంకులతో పాటు, నాబార్డ్‌ సైతం ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సహకారం అందిస్తోందని భన్వాలా చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి తమకు రూ.15,000 కోట్ల ఎక్స్‌పోజర్‌ ఉందన్నారు. ‘‘మా మొత్తం రూ.4.80 లక్షల కోట్ల ఆస్తుల్లో రూ.15,000 కోట్లు అన్నవి చాలా స్వల్పం. వీటికి సంబంధించి రిస్క్‌ లేదు. ఏ ఎగవేత కూడా మాకు ఎదురు కాలేదు. రుణం తీసుకున్న ప్రతీ సంస్థ చెల్లింపులు చేస్తూనే ఉంది’’ అని భన్వాలా వివరించారు.You may be interested

బెంగళూరులో ఎలక్ట్రిక్ టెక్నాలజీ హబ్‌

Friday 16th November 2018

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ గురువారం బెంగళూరులో తమ తొలి ఎలక్ట్రిక్ టెక్నాలజీ తయారీ హబ్‌ను ఏర్పాటు చేసింది. సుమారు రూ. 100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ హబ్‌లో ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌లో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్స్‌, పవర్ ఎలక్ట్రానిక్స్‌, మోటార్ అసెంబ్లీ మొదలైన వాటిని తయారు చేస్తారు. దీంతో తమ ఉత్పత్తి సామర్ధ్యం వార్షికంగా 25,000 ఎలక్ట్రిక్ వాహనాలకు చేరుతుందని మహీంద్రా

జీఐసీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ల్లో ఓఎఫ్‌ఎస్‌

Friday 16th November 2018

న్యూఢిల్లీ: జీఐసీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీల్లో మరింత వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)విధానంలో ఈ రెండు బీమా కంపెనీల్లో మరింత వాటాను విక్రయించడానికి కేంద్ర ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు కంపెనీల ఓఎఫ్‌ఎస్‌ కార్యక్రమాలను నిర్వహించడానికి ఆసక్తి గల మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి దీపమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) దరఖాస్తులను ఆహ్వానించింది. సదరు

Most from this category