STOCKS

News


'కోటక్ బ్యాంక్‌'కు కోర్టులో చుక్కెదురు

Tuesday 18th December 2018
news_main1545109292.png-23023

ముంబై: ప్రమోటర్ల వాటా తగ్గింపునకు సంబంధించిన గడువు వివాదంలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ (కేఎంబీ)కి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన డిసెంబర్ 31 డెడ్‌లైన్‌పై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేఎంబీ దాఖలు చేసిన పిటీషన్‌పై వచ్చే ఏడాది జనవరి 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆర్‌బీఐని ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రమోటర్ల వాటాను పెయిడప్‌ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్‌లో 20 శాతానికి, 2020 మార్చి 31నాటికి 15 శాతానికి తగ్గించుకోవాలంటూ 2018 ఆగస్టు 31న ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేఎంబీ గత వారం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో కేవలం పెయిడప్‌ క్యాపిటల్‌కి సంబంధించి మాత్రమే ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్‌ను తగ్గించుకోవాలన్న ఆర్‌బీఐ తాజాగా పెయిడప్ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్‌ కింద మార్చిందంటూ కేఎంబీ తరఫు న్యాయవాది డేరియస్ ఖంబాటా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టత కోరుతూ సెప్టెంబర్‌లో రెండు సార్లు ఆర్‌బీఐకి లేఖ రాసినప్పటికీ, ఇప్పటిదాకా స్పందన రాలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కొత్త గవర్నర్ తాజాగా మరోసారి పరిశీలించాలని, అందుకు వీలుగా డెడ్‌లైన్‌ను నెల రోజుల పాటు పొడిగించాలని కోరుతున్నామని వివరించారు. మరోవైపు, ఎప్పుడో ఆగస్టులో ఆదేశాలిస్తే.. డెడ్‌లైన్ దగ్గరకొస్తుండగా స్టే ఇవ్వాలంటూ కేఎంబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందంటూ ఆర్‌బీఐ తరఫు న్యాయవాది వెంకటేష్ ధోండ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 



You may be interested

అప్పుడు ఎన్ని నోట్లు ముద్రించారో చెప్పాల్సిందే

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్‌ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000, రూ.500 నోట్ల ముద్రణ వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఆర్‌బీఐ అనుబంధ నోట్ల ముద్రణ విభాగం నిరాకరించింది. 2016 నవంబర్‌ 9 నుంచి అదే నెల 30వ తేదీ మధ్య ఎన్ని రూ.2,000 నోట్లు, రూ.5,00 నోట్లను ముద్రించారో సమాచారమివ్వాలని కోరుతూ హరీందర్‌ దింగ్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సరైన స్పందన

ఆర్‌బీఐపై ప్రభుత్వ ఒత్తిళ్లతో ఆర్థిక అస్థిరత

Tuesday 18th December 2018

సింగపూర్‌: ఆర్‌బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్‌ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ హెచ్చరించింది. 2019 జనవరిలో జరిగే ఆర్‌బీఐ సమావేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ నియంత్రణలో ఏవైనా మార్పులు చేస్తారేమో వేచి చూస్తున్నట్టు తెలిపింది. ఆర్‌బీఐ స్వతంత్రత సహా పలు అంశాల విషయంలో ప్రభుత్వంతో పొసగక

Most from this category