STOCKS

News


బలమైన హెచ్‌ఎఫ్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీలు పోటీలో నిలబడతాయి: సుదీప్‌ దుగార్‌

Sunday 28th October 2018
news_main1540749606.png-21541

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ రుణ చెల్లింపుల్లో విఫలం అయిన తర్వాత మార్కెట్లో లిక్విడిటీ సమస్య విషయమై ఆందోనలు నెలకొనగా... ఈ ప్రభావం హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు), ఎన్‌బీఎఫ్‌సీల కంపెనీలపై తీవ్రంగా పడింది. సంబంధిత కంపెనీల షేర్లు భారీగా నష్టపోవం కూడా చూశాం. వాస్తవానికి ఈ కంపెనీల షేర్ల విలువలు గరిష్ట స్థాయికి చేరడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశమని స్టివార్ట్‌ అండ్‌ మ్యాక్‌రిచ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ సుదీప్‌ దుగార్‌ అంటున్నారు. ‘‘చాలా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు స్వల్ప కాల రుణాలు తీసుకుని దీర్ఘకాలానికి రుణాలు ఇస్తు‍న్నట్టు తెలుస్తోంది. ఇది ఆస్తులు, అప్పుల పరంగా అసమతుల్యత కావడంతో మరింత ఆందోళనకు దారితీసింది. తక్కువ వడ్డీ రేటు ఉండడం, సులభంగా రోలోవర్‌ (కొనసాగించుకోవడం) చేసుకునే అవకాశం ఉండడంతో ఫైనాన్సింగ్‌ కంపెనీలను స్వల్ప కాలిక రుణాలు ఆకర్షిస్తున్నాయి. వడ్డీ రేట్లలో మార్పుల వల్ల లబ్ధి పొందే అవకాశం కూడా వీటి వల్ల కలుగుతోంది. హెచ్‌ఎఫ్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధి రేటు చారిత్రక గరిష్ట స్థాయిలో ఉంది. బ్యాంకుల వృద్ధి రేటును కూడా దాటిపోయింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో మార్కెట్‌ను ఇవి సొంతం చేసుకున్నాయి. బ్యాంకులకు ఇక్కడ మార్కెట్‌ వాటా సొంతం చేసుకోవడం కష్టమైన పని. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీ షేర్లను మూలాల కంటే భయాలు నడిపిస్తున్నాయి. బలమైన ఆర్థిక మూలాలు, యాజమాన్యం ఉన్న కంపెనీలు ఇక ముందూ వృద్ధిని కొనసాగిస్తాయి. అయితే, ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనలు ఈ రంగానికి కనువిప్పు కలిగించేవి. ఈ రంగానికి సంబంధించి మెరుగుపరిచిన నిబంధనలు, నియంత్రణలు ఆర్‌బీఐ నుంచి వచ్చేలా చేస్తాయి. నాణ్యమైన ఆస్తులు, బలమైన ఆస్తులు- అప్పుల నిర్వహణ, అధిక కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలతో ఉన్నవి పోటీలో ముందుంటాయి’’ అని సుదీప్‌ దుగార్‌ వివరించారు.You may be interested

స్టాక్‌ బాగా పడిందని ఇన్వెస్ట్‌ చేయొద్దు: డీకే అగర్వాల్‌

Sunday 28th October 2018

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుదల, యూరోప్‌ యూనియన్‌లో వివాదాలు వెరసి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ పేర్కొన్నారు. అధిక వడ్డీ రేట్లు కఠినమైన ఆర్థిక పరిస్థితులకు దారితీయవచ్చని, దాంతో వృద్ధి రేటు దెబ్బతినొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయన్నారు. అమెరికా ఆర్థిక వృద్ధి పెరుగుదల ఆరంభంమైన దగ్గర్నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన దేశాల నుంచి

వ్యాల్యూ స్టాక్స్‌ కోసం అన్వేషిస్తున్నారా...?

Sunday 28th October 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు కీలకమైన మద్దతు స్థాయిలకు సమీపంలో ఉన్నాయి. గరిష్ట స్థాయిల నుంచి చూస్తే సుమారు 14 శాతం నష్టపోయాయి. అయితే, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లో ఎక్కువ శాతం, బ్లూచిప్‌ కంపెనీల్లో కొన్ని ఇండెక్స్‌ల కంటే ఎక్కువే నష్టాలను చూవిచూశాయి. దీంతో పెట్టుబడి పెట్టాలనుకునే వారి ముందు... తక్కువ ధరల వద్ద లభిస్తున్న ఎన్నో స్టాక్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలన్న సంశయం ఎదురైనా

Most from this category