STOCKS

News


ఎయిర్‌లైన్స్‌ డిస్కౌంట్ల ధమాకా!!

Tuesday 4th September 2018
news_main1536037148.png-19933

న్యూఢిల్లీ: ఆఫ్‌ సీజన్‌లో ప్రయాణికులను ఆకర్షించేందుకు దేశీ చౌక చార్జీల విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పోటాపోటీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రూ. 999 టికెట్ చార్జీలు మొదలుకుని 20 శాతం దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు ముడి చమురు రేట్ల పెరుగుదల, మరోవైపు రూపాయి క్షీణతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మార్కెట్‌లో పట్టు కోసం ఎయిర్‌లైన్స్ తాజాగా డిస్కౌంట్లకు తెరతీయడం గమనార్హం. 
ఇండిగోలో పది లక్షల సీట్లు..
తమ నెట్‌వర్క్‌లోని 59 ప్రాంతాలకు ప్రయాణించే వారికి పది లక్షల పైచిలుకు సీట్లను డిస్కౌంట్ రేట్లకే అందిస్తున్నట్లు ప్రకటించింది ఇండిగో ఎయిర్‌లైన్స్. రూ.999 నుంచి వన్‌ వే (అన్నీ కలిపి) టికెట్ అందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి 2019 మార్చి 30 దాకా ప్రయాణాల కోసం ఈ ఆఫర్‌లో బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సోమవారం ప్రారంభమైన "ఫెస్టివ్ సేల్"    నాలుగు రోజులు కొనసాగుతుందని ఇండిగో పేర్కొంది. మొబైల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే రూ. 600 దాకా సూపర్ క్యాష్ లేదా 20 శాతం మేర రీఫండ్ కూడా ప్రకటించింది ఇండిగో. 
ఎయిర్‌ఏషియా ఆఫర్‌..
ఎయిర్ఏషియా ఇండియా కూడా అదే బాటలో దేశీ ప్రయాణాలకు రూ. 999 నుంచి, విదేశీ ప్రయాణాలకు రూ. 1,399 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర 120 పైచిలుకు ప్రాంతాలకు డిస్కౌంట్ చార్జీలు వర్తిస్తాయి. అంతర్జాతీయంగా కౌలాలంపూర్‌, బ్యాంకాక్, సిడ్నీ మొదలైన రూట్లలో కూడా చౌక చార్జీలను ఆఫర్ చేస్తోంది ఎయిర్‌ఏషియా ఇండియా. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి నవంబర్‌ 26 దాకా చేసే ప్రయాణాలకు సంబంధించి సెప్టెంబర్ 2 నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. ఈ "బిగ్‌ సేల్" ఎనిమిది రోజుల పాటు ఉంటుంది.
గోఎయిర్‌ సైతం..
గోఎయిర్ కూడా దేశీ ప్రయాణాలకు రూ. 1,099 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్‌ 3 నుంచి 2019 మార్చి 31 దాకా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్ 3న ప్రారంభమైన టికెట్ల విక్రయం మూడు రోజుల పాటు సాగుతుందని సంస్థ వెల్లడించింది. 
చమురు, రూపాయి కుంగదీస్తున్నా..
సాధారణంగా పండుగలు మొదలయ్యే దాకా విమానయాన సంస్థలకు ఆఫ్‌సీజన్‌గానే ఉంటుందని, దీంతో అవి డిమాండ్‌ను పెంచేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆఫర్లు ఇస్తుండటం గమనార్హమని పేర్కొన్నాయి. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడం, రూపాయి రికార్డు స్థాయిలో క్షీణిస్తుండటం దేశీ విమానయాన సంస్థలను కుంగదీస్తోంది. అయితే, విపరీతమైన పోటీ నెలకొనడంతో టికెట్ చార్జీలను పెంచలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో సింహభాగం వాటా ఉన్న సంస్థ డిస్కౌంట్లకు టికెట్లు ఆఫర్ చేస్తే మిగతా కంపెనీలు కూడా అదే బాట పట్టక తప్పదని విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా బ్రెంట్ క్రూడాయిల్ రేటు సుమారు 47 శాతం పెరగ్గా, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సుమారు 9.5 శాతం తగ్గింది.
    పెరిగిన వ్యయాలను ప్యాసింజర్లకు బదలాయించలేని పరిస్థితుల కారణంగా కొన్ని విమానయాన సంస్థలు గత కొన్నాళ్లుగా నష్టాలు,  తక్కువ స్థాయిలో లాభాలే నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ముడిచమురు ధరల పెరుగుదల, అధిక వడ్డీ రేట్లు, సిబ్బంది జీతభత్యాల పెరుగుదల వంటి కారణాలతో ఈ ఏడాదిలో భారత్ సహా అంతర్జాతీయంగా విమానయాన సంస్థల లాభాలు గణనీయంగా తగ్గొచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌లైన్స్ లాభాలు కలిపి 33.8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండొచ్చని పేర్కొంది. 2017 డిసెంబర్‌లో అంచనా వేసిన 38.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే సవరించిన లెక్కలు 12 శాతం మేర తక్కువ స్థాయిలో ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా దాదాపు 290 పైచిలుకు ఎయిర్‌లైన్స్‌కి ఐఏటీఏలో సభ్యత్వం ఉంది. 

ఈసారి దేశీ ఎయిర్‌లైన్స్‌కు భారీ నష్టాలు: సీఏపీఏ

ముంబై: దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 1.65-1.90 బిలియన్ డాలర్ల మేర భారీ స్థాయిలో ఉండవచ్చని సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) పేర్కొంది. గతంలో 430-460 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండొచ్చన్న అంచనాలను సవరించింది. అలాగే, సమీప భవిష్యత్‌లో ఎయిర్‌లైన్స్ 3 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమీకరించుకోవాల్సి రావొచ్చని 
 2019 అర్ధవార్షిక విమానయాన రంగ అంచనాలపై రూపొందించిన ఒక నివేదికలో సీఏపీఏ పేర్కొంది.



You may be interested

ఆగస్ట్‌లో పెరిగిన ట్రాక్టర్ల అమ్మకాలు

Tuesday 4th September 2018

న్యూఢిల్లీ/ముంబై: ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో ట్రాక్టర్ల విక్రయాలకు కలిసొచ్చింది. ఆగస్ట్‌ మాసంలో ట్రాక్టర్ల అమ్మకాల్లో మంచి వృద్ధి నెలకొంది. ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ (ఐటీఎల్‌)కు చెందిన సోనాలికా ట్రాక్టర్ల విక్రయాలు ఏకంగా 23.2 శాతం పెరిగాయి. 7,369 వాహనాలను విక్రయించింది. ఎగుమతులతో కలిపి 2017 ఆగస్ట్‌లో అమ్ముడుపోయిన ట్రాక్టర్లు 6,036 మాత్రమే. దీంతో పోలిస్తే విక్రయాలు 23.2 శాతం పెరిగాయి. ఈ కంపెనీ ట్రాక్టర్ల ఎగుమతులు క్రితం ఏడాది ఆగస్ట్‌లో

క్లాసిక్‌ పోలో ‘ఫాస్ట్‌ ఫ్యాషన్‌’

Tuesday 4th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెడీమేడ్స్‌ రంగంలో ఫ్యాషన్‌ను ఫాలో అయితేనే రిటైలర్లు విజయవంతమవుతారు. ఇందులో భాగంగానే రాయల్‌ క్లాసిక్‌ మిల్స్‌ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు కస్టమర్లకు చేరవేసేందుకు ఫాస్ట్‌ ఫ్యాషన్‌ పేరుతో రిటైలర్ల కోసం ఓ యాప్‌ను రూపొందించింది. టీ–షర్ట్స్, షర్ట్స్, ట్రూజర్స్, డెనిమ్స్‌.. ఇలా విభాగాల వారీగా కొత్త డిజైన్లు ఈ యాప్‌లో ఉంటాయి. వారంలోగా రిటైలర్లు ఆర్డరివ్వాలి. ఆర్డరిచ్చిన నెల రోజుల్లో సరుకు

Most from this category