STOCKS

News


32 శాతం తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

Wednesday 14th November 2018
news_main1542172895.png-21974

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ సెప్టెంబరు త్రైమాసికంలో నిరాశ పరిచింది. స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32.7 శాతం తగ్గి రూ.636 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.2,531 కోట్ల నుంచి రూ.2,569 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-సెప్టెంబరు పీరియడ్‌లో రూ.5,116 కోట్ల టర్నోవరుపై రూ.1,612 కోట్ల నికరలాభం సాధించింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 0.47 శాతం అధికమై రూ.107.45 వద్ద స్థిరపడింది.



You may be interested

225 శాతం పెరిగిన రామ్‌కీ లాభం

Wednesday 14th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 2018-19 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 225 శాతం పెరిగి రూ.11.7 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.357 కోట్ల నుంచి రూ.364 కోట్లను తాకింది. ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య ఆరు నెలల కాలంలో రూ.625 కోట్ల టర్నోవరుపై మొత్తం రూ.30 కోట్ల నికరలాభం సాధించినట్లు కంపెనీ తెలియజేసింది.

దిగజారిన సీఎఫ్‌వోల ఆశావాదం

Wednesday 14th November 2018

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఎదుర్కొంటున్న నిధుల లభ్యత సమస్య, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాల కారణంగా దేశంలో కంపెనీల చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ల (సీఎఫ్‌వో) ఆశావాదం 19 త్రైమాసికాల కనిష్ట స్థాయికి దిగజారింది. దేశంలో అన్ని రంగాలకు చెందిన 300 మంది సీఎఫ్‌వోల నుంచి వారి కంపెనీల ఆరోగ్య స్థితి, వ్యాపార రిస్క్‌ పరిస్థితులు, స్థూల ఆర్థిక పరిస్థితులపై అభిప్రాయాలను డన్‌ అండ్‌‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సంస్థ

Most from this category