STOCKS

News


ఎన్‌ఎండీసీ లాభం రూ. 975 కోట్లు

Thursday 9th August 2018
news_main1533792494.png-19079

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ రూ. 975.27 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.969 కోట్లతో పోలిస్తే స్వల్ప వృద్ధి సాధించింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 2,970 కోట్ల నుంచి రూ. 2,547 కోట్లకు తగ్గింది. బైలదిల్లా ప్రాజెక్టు విషయంలో పరిహారం కింద కలెక్టర్ లెక్క వేసినట్లుగా రూ. 7,241.35 కోట్లు డిపాజిట్ చేయమంటూ ఎందుకు ఆదేశించరాదో తెలపాలని దంతేవాడ జిల్లా కలెక్టర్ నుంచి జూలై 31న షోకాజ్ నోటీసులు వచ్చినట్లు ఎన్‌ఎండీసీ తెలిపింది. వివరణనిచ్చేందుకు ఆగస్టు 31దాకా గడువు విధించినట్లు పేర్కొంది. అయితే, ఈ పరిహార నిబంధన ఎన్‌ఎ౾ండీసీకి వర్తించదని న్యాయనిపుణులు అభిప్రాయపడిన నేపథ్యంలో ఉత్తర్వులను సవాల్ చేయనున్నట్లు పేర్కొంది. 



You may be interested

సిప్లా లాభం రూ.451 కోట్లు

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.409 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.451 కోట్లకు పెరిగిందని సిప్లా తెలియజేసింది. అమెరికాలో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, భారత్‌, దక్షిణాఫ్రికాల్లో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ క్యూ1లో ఈ స్థాయి నికర లాభం సాధించామని  సిప్లా ఎమ్‌డీ,

వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు సీసీఐ ఆమోదం

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: దేశీ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ట్వీట్ చేసింది. ఈ డీల్ విలువ దాదాపు 16 బిలియన్ డాలర్లు. ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 77 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ ఈ ఏడాది మేలో ప్రకటించింది. చిన్న వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ

Most from this category