STOCKS

News


ఇద్దరు పీఎన్‌బీ ఈడీలపై వేటు

Monday 21st January 2019
news_main1548050325.png-23693

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం ప్రభావంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి చెందిన మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. విధుల నిర్వహణలో వైఫల్యం ఆరోపణలతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ (ఈడీ) కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్‌లను పదవీ బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థను (సీబీఎస్‌), అంతర్జాతీయ లావాదేవీలకు ఉపయోగించే వ్యవస్థ స్విఫ్ట్‌కు అనుసంధానించాలన్న ఆర్‌బీఐ ఆదేశాలను అమలు చేయడంలో ఇద్దరూ విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. బ్రహ్మాజీ రావు ఈ నెలలో రిటైర్ కావాల్సి ఉండగా, శరణ్ పొడిగించిన పదవీకాలం ఈ ఏడాది మేలో ముగియాల్సి ఉంది. వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ రూ. 14,000 కోట్ల కుంభకోణం దరిమిలా అప్పట్లో పీఎన్‌బీ చీఫ్‌గా వ్యవహరించిన ఉషా అనంతసుబ్రమణియన్‌ను కూడా కేంద్రం గతేడాది డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 21st January 2019

మూడో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాలపై బ్రోకరేజ్‌ సంస్థలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే ఆస్తుల నాణ్యత కొంత క్షీణించడంపై స్వల్ప ఆందోళన వ్యక్తం చేశాయి. పలు బ్రోకింగ్‌ సంస్థలు బ్యాంకు షేరుపై బుల్లిష్‌గా ఉన్నాయి. 1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2670 నుంచి 2730 రూపాయలకు పెంచింది. లాభాలు అంచనాలకు తగినట్లే ఉన్నాయి. అయితే కాసా గ్రోత్‌ కొంత మందగించడంపై అసంతృప్తి. అసెట్‌ క్వాలిటీ కాస్త తగ్గినా

బ్రిటన్‌ను మించనున్న భారత్‌

Monday 21st January 2019

- ప్రపంచ ఎకానమీల్లో అయిదో స్థానానికి - ఈ ఏడాది ర్యాంకింగ్స్‌పై పీడబ్ల్యూసీ అంచనాలు న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఈసారి బ్రిటన్‌ను భారత్ అధిగమించవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఒక నివేదికలో పేర్కొంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2017లో ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్ 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ఆరో అతి పెద్ద ఎకానమీగా అవతరించింది. బ్రిటన్ ‍అయిదో స్థానంలో ఉంది. అయితే, 

Most from this category