News


ఫిబ్రవరిలో ‘తయారీ’ బాగుంది: నికాయ్‌ పీఎంఐ

Saturday 2nd March 2019
news_main1551503146.png-24400

న్యూఢిల్లీ: తయారీ రంగం ఫిబ్రవరిలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. గడచిన 14  నెలల్లో ఎప్పుడూలేనంత ఫలితం నమోదయ్యింది. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ఫిబ్రవరిలో 54.3గా నమోదయ్యింది. జనవరిలో ఈ సూచీ 53.9గా ఉంది. అమ్మకాలు, ఉత్పత్తి, ఉపాధి కల్పన అన్నీ సానుకూలంగా ఉన్నట్లు నికాయ్‌ నెలవారీ సర్వే పేర్కొంది. నిజానికి నికాయ్‌ సూచీ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపున నమోదయితే, క్షీణతగా పరిగణిస్తారు. అయితే సూచీ 50 పైన కొనసాగడం ఇది వరుసగా 19వ నెల కావడం గమనార్హం.



You may be interested

నాల్కో రూ.4.50 మధ్యంతర డివిడెండ్‌

Saturday 2nd March 2019

న్యూఢిల్లీ: వాటాదారులకు ప్రతీ షేరు (రూ.5 ముఖ విలువ)పై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.4.50 మధ్యంతర డివిడెండ్‌గా ఇవ్వాలని నాల్కో కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోపే అర్హులైన వాటాదారులకు డివిడెండ్‌ పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. డివిడెండ్‌ ఇచ్చేందుకు రికార్డు డేట్‌గా ఈ నెల 12వ తేదీని ఖరారు చేసింది. అంటే ఆ తేదీ నాటికి కంపెనీ రికార్డుల్లో వాటాదారులుగా పేరు నమోదైన వారికే డివిడెండ్‌ పంపిణీ జరుగుతుంది.

మారుతీ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి

Saturday 2nd March 2019

ఫిబ్రవరిలో పెరిగిన కార్ల విక్రయాలు హోండా, మహీంద్రా రెండంకెల స్థాయిలో వృద్ధి న్యూఢిల్లీ: కొనుగోలుదారుల సెంటిమెంట్ జనవరితో పోలిస్తే కొంత మెరుగుపడిన నేపథ్యంలో గత నెలలో కార్ల విక్రయాలు కొంత మెరుగుపడ్డాయి. మారుతీ సుజుకీ విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదు కాగా.. హోండా కార్స్‌, మహీంద్రా అండ్ మహీంద్రా రెండంకెల స్థాయి వృద్ధి కనపర్చాయి. టాటా మోటార్స్ కార్ల ‍అమ్మకాలు రెండు శాతం పెరగ్గా, టయోటా కిర్లోస్కర్ విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం

Most from this category