STOCKS

News


ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ లాభం 66 శాతం అప్‌

Thursday 18th October 2018
news_main1539834196.png-21257

న్యూఢిల్లీ: ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 66 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.67 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.119 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ సుధీర్‌ సింగ్‌ తెలిపారు. ట్రావెల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీమా విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని వివరించారు.  ఆదాయం రూ.737 కోట్ల నుంచి 23 శాతం పెరిగి రూ.907 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 30 శాతం, ఆదాయం 10 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. 

స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా, ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ షేర్‌ 4.3  శాతం లాభంతో రూ.1,190 వద్ద ముగిసింది. 



You may be interested

భారత్‌ హోటల్స్‌ ఐపీఓకు సెబీ ఓకే

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: భారత్‌ హోటల్స్‌, సూక్ష్మ రుణ సంస్థ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ ఐపీఓలకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. వీటితో ఈ ఏడాది ఐపీఓకు అనుమతులు పొందిన కంపెనీల సంఖ్య 60కు చేరింది.  భారత్‌ హోటల్స్‌ ఐపీఓ @ 1,200 కోట్లు  భారత్‌ హోటల్స్‌ కంపెనీ ద లలిత్‌ బ్రాండ్‌ కింద ఐదు నక్షత్రాల హోటళ్లు, ప్యాలస్‌లు, రిసార్ట్స్‌ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా ద లలిత్‌ ట్రావెలర్‌

మరోమైలు రాయిని దాటిన ‘హోండా యాక్టివా’

Thursday 18th October 2018

ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్‌ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ)... తాజాగా మరో మైలు రాయిని దాటింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ టూవీలరైన ‘యాక్టివా’ అమ్మకాలు 2 కోట్లకు చేరుకున్నట్లకు ప్రకటించింది. మొదటి కోటి యాక్టివాలను విక్రయించడానికి 15 ఏళ్ల సమయం పట్టగా, ఆ తరువాత కోటి వాహనాల అమ్మకాలకు కేవలం మూడేళ్లలోనే పూర్తిచేయగలిగినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌

Most from this category