STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్కామ్‌పై విచారణ జరిపించాలి

Wednesday 30th January 2019
news_main1548823677.png-23891

-మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా డిమాండ్‌
-ఇది దురుద్దేశపూరితం: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన విషయమై విచారణ జరిపించాలని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా డిమాండ్‌ చేశారు. తక్షణం ఈ విషయమై ప్రభుత్వం విచారణ జరపకపోతే  ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వేలాది డొల్ల కంపెనీలను రద్దు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, డొల్ల కంపెనీల ద్వారానే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఈ కుంభకోణానికి పాల్పడిందని విమర్శించారు. నియంత్రణ సంస్థలతో సహా ప్రభుత్వ విభాగాలన్నీ ఈ కుంభకోణాన్ని అరికట్టటంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు.
భారత్‌లో భారీ కుంభకోణం..!
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్‌ వెల్లడించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ బ్యాంక్‌ల ద్వారా రూ.97,000 కోట్ల రుణాలు సమీకరించిందని,  డొల్ల కంపెనీల నెట్‌వర్క్‌ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు రూ.31,000 కోట్లు దారి మళ్లించారని పేర్కొంది. భారత్‌లో ఇదే అతి పెద్ద ఆర్థిక కుంభకోణమని కోబ్రాపోస్ట్‌ వివరించింది.
అవకతవకలకు పాల్పడలేదు...
కాగా కోబ్రాపోస్ట్‌​ కథనాన్ని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖండించింది. తమ కంపెనీకి, వాటాదారులకు హాని చేసే దురుద్దేశపూరితంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ఒక బాధ్యతాయుత కంపెనీగా నియమ నిబంధనలకనుగుణంగానే రుణాలు ఇచ్చామని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొంది. ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలన్నీ తమ కంపెనీకి ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ను ఇచ్చాయని, తమ ఖాతా పుస్తకాలను అంతర్జాతీయ ఆడిటర్లు ఆడిట్‌ చేస్తారని వివరించింది. కాగా బ్యాంక్‌లు కాస్త ఏమరుపాటుగా ఉన్నా, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ నిధులను దారిమళ్లించిందన్న విషయాన్ని పసిగట్టేవని సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు.
రూ.1,375 కోట్ల రుణం విక్రయం...
మరోవైపు దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ రూ.1,375 కోట్ల హోల్‌సేల్‌ లోన్‌ను అంతర్జాతీయ ఆల్టర్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌, ఓక్‌ట్రీకి విక్రయించింది. ఆర్‌బీఐ సెక్యూరిటైజేషన్‌ నియమ నిబంధనల ప్రకారమే ఈ లావాదేవీ జరిగిందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. ఈ లావాదేవీ కారణంగా తమ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ రుణాలు 8 శాతం తగ్గాయని, రిటైల్‌ రుణాలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని కంపెనీ సీఎమ్‌డీ కపిల్‌ వాధ్వాన్‌ పేర్కొన్నారు. కాగా నివాసిత రియల్‌ ఎస్టేట్‌ సెగ్మెంట్లో భారత్‌కు సంబంధించి ఇదే అతి పెద్ద లావాదేవీ.You may be interested

జెట్‌లో బ్యాంకులకు వాటా

Wednesday 30th January 2019

రుణాలను వాటాగా మార్చడానికి...! మరికొన్ని ప్రతిపాదనలకు  ఆమోదం కోసం న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌) వచ్చే నెల 21న జరగనున్నది. ఈ ఈజీఎమ్‌లో రుణాలను ఈక్విటీగా మార్చడం, ఆధీకృత మూలధనం పెంపు, తదితర ప్రతిపాదనలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ వాటాదారుల ఆమోదం కోరనున్నది. నిధుల సమస్య తీవ్రంగా ఉండటంతో రుణదాతలు ఇచ్చిన రుణాలను మొత్తంగా గానీ, పాక్షికంగా గానీ ఈక్విటీగా గానీ, కన్వర్టబుల్‌ డిబెంచర్లుగా గానీ  లేదా ఇతర సెక్యూరిటీలగా

హెచ్‌సీఎల్‌ లాభం రయ్‌

Wednesday 30th January 2019

రూ. 2 డివిడెండ్‌ క్యూ3లో లాభం 19 శాతం అప్‌; రూ. 2,611 కోట్లు న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 2,611 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 2,194 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మరోవైపు, సంస్థ ఆదాయం సుమారు 23 శాతం వృద్ధితో రూ. 12,808

Most from this category