News


త్వరలో కొత్త పసిడి విధానం

Friday 28th December 2018
Markets_main1545972255.png-23280

  • కేంద్ర వాణిజ్య మంత్రి ప్రభు వెల్లడి

న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
వచ్చే రెండేళ్లలో 100 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు లక్ష్యం..
భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు మంత్రి ప్రభు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు రప్పించటమనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. భారత్‌లో ఏ రంగాలు భారీ పెట్టుబడులను కోరుతున్నాయి? ఇందుకు ఏ దేశాల నుంచి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది? వంటి అంశాలపై వాణిజ్య, పరిశ్రమల పరిశ్రమల మంత్రిత్వశాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ దిశగా విదేశాలతో చర్చలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
స్టార్టప్స్‌ పన్ను సమస్యల పరిష్కారం
స్టార్టప్స్‌ పురోగతికి కేంద్రం తగిన చర్యలన్నీ తీసుకుంటుందని సురేశ్‌ ప్రభు తెలిపారు. ప్రత్యేకించి ఏంజిల్‌ ఫండ్స్‌ నుంచి నిధుల సమీకరణలో స్టార్టప్స్‌ ఎదుర్కొంటున్న పన్ను సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టార్టప్స్‌, ఏంజిల్‌ ఇన్వెస్టర్స్‌ ఎదుర్కొంటున్న పన్ను సమస్యల పరిష్కార మార్గాలను సూచించడానికి గత వారం కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

ఈక్విటీ నిధులు @ రూ.63,744 కోట్లు

Friday 28th December 2018

- గత ఏడాదితో పోలిస్తే 60 శాతం క్షీణత - నిధుల సమీకరణలో అగ్రస్థానంలో ఐపీఓలు - ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడి న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఈ ఏడాది వివిధ ఈక్విటీ మార్గాల ద్వారా రూ.63,744 కోట్లు సమీకరించాయి. గత ఏడాది సమీకరించిన రూ.1.6 లక్షల కోట్ల నిధులతో పోలిస్తే ఇది 60 శాతం తక్కువని డేటా ఎనలిటిక్స్‌ సంస్థ, ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., - ఈక్విటీ ద్వారా

చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయ్‌

Friday 28th December 2018

 అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి - పెద్ద కంపెనీల ఆగడాలు తగ్గుతాయి - ఈ-కామర్స్ కొత్త నిబంధనలపై పరిశ్రమ వర్గాల వ్యాఖ్య న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ-కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. "బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా

Most from this category